
ఏపీలో అరాచక, విధ్వంస పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. ఊబిలోకి నెట్టేసినట్లు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా వచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ పరిస్థితిపై ఆలోచించాలని ఆమె కోరారు. ఉద్యోగస్తులందరూ ఈ జీతం మీదే ఆధారపడి తీసుకున్న వస్తువులపై బ్యాంకుల వద్దకు వెళ్లి ఈఏంఐ మీద కాస్త వెసులుబాటు కల్పించాలని ప్రాధేయపడే స్థితిలో ఉన్నారని ఆమె వెల్లడించారు.
అలాగే గ్రామాలకు 15 ఆర్థిక కమిటీ కింద కేంద్రం నేరుగా ఇస్తున్న సహకారాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీని సమర్థించే సర్పంచులు సైతం. ఇవ్వాళ బయటకొచ్చి సోషల్ మీడియాలో, ప్రెస్‌లలో తమ వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని గోడు వెళ్లబోసుకుంటున్నారని ఆమె గుర్తు చేశారు.
దారి మళ్లించిన నిధులతో ఎక్కడైనా అభివృద్ధి చేశారా అంటే, అదీ లేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయని, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక రాయలసీమ బిడ్డలు వలసపోతున్నారని ఆమె తెలిపారు. ఇటువంటి పాలన తాను ఎన్నడూ చూడలేదని బిజెపి నేత వాపోయారు.
More Stories
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ
తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు
నారా లోకేష్‌పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి