రూ.2 వేల నోట్ల ఉపసంహరణ

దేశంలో నరేంద్ర మోదీ  సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని, మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది.  ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ. 20 వేల వరకు మాత్రమే రూ. 2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. 

మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ  పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. గత కొద్ది కాలంగా రూ. 2 వేల నోట్లు మార్కెట్లో  సరఫరాలై కావడం లేదు. రూ. 1000 స్థానంలో రూ. 2 వేల నోటును కేంద్రం తీసుకొచ్చింది.

2016లో పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తీసుకోసిసిన సమయంలో నవంబర్ 8న రూ. 2,000 నోట్లను ఆర్బీఐ విడుదల చేయగా, నవంబర్ 10 నుండి వాడుకలో ఉంది. అప్పటి నుంచి చెలామణిలో ఉన్న రూ. 2వేల  నోట్లను క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

 అయితే, మొదటినుండి ఈ నోట్లు ఎక్కువగా నల్లధనం పోగుచేసుకోవడానికి దోహదపడుతుందని, అందుకనే మార్కెట్ లో కనిపించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్బీఐ సహితం కొంతకాలంగా ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018-19 నుంచి ప్రింటింగ్ నిలిపివేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పుడు దేశంలో రూ. 3.62 లక్షల కోట్ల 2 వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉన్నట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. 

నోట్లను మార్చుకొనే విధానం
  • ప్రజలు  తమ దగ్గర ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. 
  • దీనికి తగిన డబ్బును రూ. 500, రూ. 100 నోట్ల కింద మీకు తిరిగి చెల్లిస్తారు.
  • బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను మీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. 
  • రోజుకు రూ. 20 వేలను మాత్రమే డిపాజిట్ చేయాలి. అంటే 10 నోట్లను మాత్రమే.
  •  పది రూ. 2 వేల నోట్లను మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే అవకాశం 
  • ఒక వేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు.