నటి తమన్నా భాటియాకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటిస్

ప్రముఖ నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023  మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినందుకుగాను ఈ నెల 29న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  తమన్న చేసిన పనికి తమకు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రసార హక్కులు కలిగిన వయాకమ్‌ ఫిర్యాదు చేసింది.

మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తాఖీదులిచ్చారు. ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకమ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈమధ్యకాలంలో తమన్నా సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తున్న విషయం తెల్సిందే. ఎప్పటినుంచో ఆమె మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ కోసం పనిచేస్తుంది. అయితే మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ కు ఇదేమి కొత్త కాదు. 

ఈ కేసులో కేవలం తమన్నా మాత్రమే కాదు చాలామంది నటులు ఉన్నారు. ఇప్పటికే నటుడు సంజయ్ దత్, గాయకుడు బాద్ షా, జాక్వలిన్ ఫెర్నాండజ్ మేనేజర్ లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది.

ఇదే కేసులో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 23న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. తాను ఆ రోజున దేశంలో లేనని పేర్కొన్నారు. దీంతో తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని ఆయన పోలీసులను కోరారు.