ఆసియా కప్ 2023 నిర్వహణలో పాక్ కు చుక్కెదురు

 
ఈ ఏడాది సెప్టెంబర్ లో తమ దేశంలో ఆసియా కప్ 2023ను తమ దేశంలో  నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుకొంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చుక్కెదురైంది. ఆసియా కప్ క్రికెట్‌ టోర్నీ ఆతిథ్యం ఆ దేశం చేజారింది. ఈ టోర్నీని పాక్‌ నుంచి మరో చోటుకు తరలించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ నిర్ణయించింది.
ఈ ఏడాది ఆసియా కప్ -2023 క్రికెట్‌ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. పాక్ లో సెప్టెంబర్‌ 2న ఈ టోర్నీ ఆరంభం కానుంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌లో జరిగే ఈ టోర్నీకి భారత జట్టును పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పింది.
ఈ పోటీలను శ్రీలంకకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆసియా కప్ వేదికను ఆ దేశం నుండి మార్చాలని బీసీసీఐ డిమాండ్ కు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లనుండి అనూహ్యంగా మద్దతు లభించడంతో  పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. ఈ పరిణామం పాకిస్థాన్ కు  దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లయింది.  ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ టీమ్ ను పంపే ప్రసక్తే లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది.

అయితే పాక్ బోర్డు మాత్రం ఎట్లాగైనా తమదేశంలోనే జరిగే విధంగా చూసుకునేందుకు అవసరం అనుకొంటే భారత్ ఆడే మ్యాచ్ లను మాత్రం మరో దేశంలో నిర్వహించి, ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాక్ బోర్డుకే ఇవ్వాలని పీసీబీ ఛైర్మన్ నజమ్ సేఠీ ఏసీసీకి ప్రతిపాదించారు. అంతేకాదు, టోర్నీ ని మరోదేశంకు మార్చితే పాకిస్థాన్ ఆడటానికి నిరాకరిస్తూ ఆ టీమ్ స్థానంలో యూఏఈకి అవకాశం ఇవ్వాలనీ ఏసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అదే నిజమైతే పాకిస్థాన్ బోర్డుకు, టీమ్ కు కోలుకోలేని దెబ్బ పడినట్లే కాగలదు. ఆసియా కప్ ను పాక్ నుంచి తరలిస్తే అక్కడి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో పీసీబీ ఛీఫ్ గా ఉన్న రమీజ్ రాజా అయితే తాము భారత్ లో  అక్టోబర్ మొదటివారణలో జరగబోయే ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి అధ్యక్షుడు కూడా పరోక్షంగా ఇదే మాట చెప్పారు. ప్రపంచ కప్ లో ఆడటానికి తమ ప్రభుత్వం కూడా అంగీకరించకపోవచ్చని సేఠీ గతంలో పేర్కొన్నారు.