టెక్సాస్‌లో కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా కోర్డు జడ్జి కూతరు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్లెట్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) ఓ మాల్‌లో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9 మంది మృతిచెందగా, చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన అమ్మాయి కూడా మృతి చెందింది
 
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఐశ్వర్య తాటికొండ (21) మృతి చెందినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు. ఐశ్వర్య కుటుంబం హైదరాబాద్ కొత్తపేటలో నివాసం ఉంటుండగా, ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు మేజిస్ట్రేట్. మాడు సంవత్సరాల క్రితం ఐశ్వర ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లారు.
 
మాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఐశ్వర్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఐశ్వర్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి.
 
ఉత్తర డల్లాస్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని స్ప్రాలింగ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు జరిగాయి. అల్లెన్ మాల్‌లోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు దుండగులు విచక్షాణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత షాపింగ్ మాల్‌లోని కస్టమర్లు, ఉద్యోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు ఒ నిందితుడిని హతమార్చారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు టెక్సాస్‌లో అధికంగా ఉంటారు. ఇక్కడ మెుత్తం 2 లక్షల జనభా ఉంటే అందులో సగం వరకు తెలుగువారే ఉంటారు. అలాంటి ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించటంతో తెలుగు ప్రజల్లో భయం నెలకొంది. ఇదిలా ఉదిలా ఉండగా, అదే రోజు టెక్సాస్ సమీపంలోని ఫ్రిస్కన్ ప్రాంతంలోనూ ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.