దేశ ప్రజానీకంలో మానసిక ఆశాంతి పెరిగిపోతుండటం కుటుంబాల ఆరోగ్య బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దేశంలోని 20 శాతం కుటుంబాలలో ఒక్కరైనా మానసిన రుగ్మతతో బాధపడుతున్నారు. పేదరికం వారిని కుంగదీస్తోంది. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2018 జూలై-డిసెంబర్ మధ్యకాలంలో నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్)లో 1.18 లక్షల కుటుంబాలకు చెందిన 5.76 లక్షల మందిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వే సందర్భంగా 6,679 మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దేశంలో ఈ తరహా సర్వే నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఆరోగ్య పరిరక్షణ కోసం కుటుంబాలు చేస్తును వ్యయంలో 18.1 శాతం మానసిక అశాంతి పైనే అవుతోంది. అసాధారణ ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, సంబంధాలు, మానసిన అనారోగ్యాలు, ఒత్తిడి, మతిభ్రమణం, మేధోసంబంధమైన బలహీనతలు వంటి వాటిని మానసిక ఆరోగ్య అంశాలుగా వర్గీకరించారు.
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్ డామన్ డయ్యూ (23.4 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (23.9 శాతం), సిక్కిం (31.9 శాతం) వంటి చిన్న ప్రాంతాలలోనే మానసిక రుగ్మతలపై పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉంటోంది. పెద్ద రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర (21.3 శాతం), తెలంగాణ (22.2 శాతం)లలో ఖర్చు ఎక్కువగా ఉంటోంది.
ఈ అధ్యయనం ప్రకారం 59.5 శాతం కుటుంబాలు ఆకస్మికంగా వచ్చిపడే ఆరోగ్య సమస్యలపై ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. భారత్ తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆరోగ్య సమస్యలలో ఆరో వంతు మానసిక ఆరోగ్యానికి సంబంధించినవేనని సర్వే ప్రస్తావించింది. ఒత్తిడి, వ్యాకులత, మానసిక అనారోగ్యాలు, మనోవైకల్యం వంటివి వీటిలో ఉన్నాయి.
‘మొత్తం మీద 20.7 శాతం కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోతున్నాయి. ఆరోగ్య సంబంధమైన ఖర్చులను తగ్గించుకోవాలంటే మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సత్వరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అధ్యయన సహ రచయిత, కొచ్చిలోని అమృత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ అండ్ రిసెర్చ్ సెంటర్ అధ్యాపకుడు డాక్టర్ డెనీు జాన్ తెలిపారు. మానసిన అనారోగ్యాలపై అవుతును ఖర్చును తగ్గించేందుకు ఆయా కుటుంబాలకు ఆర్థికంగా సాయపడాల్సి ఉంటుందని ఈ అధ్యయనం సూచించింది.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు