వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్ ఏర్పాటు

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిఐజీ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్‌పి ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు.
 
ఏప్రిల్ 30లోగా విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. కుట్ర ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని సూచించింది. 6 నెలలలోపు విచారణ మొదలు కాకపోయి ఉంటే ఏ5 నిందితుడు బెయిల్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించింది. గతంలో ఈ హత్య కేసు విచారించిన రామ్ సింగ్ ను విచారణ పరిధి నుంచి తొలగించింది. ఇకపై వివేకా హత్య కేసు విచారణను ఈ కొత్త సిట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది. రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి ఎం ఆర్ షా తెలిపారు.  ఈ కేసులో విస్తృత కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలని.. ఏప్రిల్ 30 వరకు విచారణను ముగించాలంటూ సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది.