
తెలంగాణ కోరుతున్నట్టు కృష్ణా జలాల పున:పంపిణీ సాధ్యం కాదని కృష్ణా జల వివాదాల టైబ్యునల్-2 (బ్రజేష్ కుమార్ టైబ్యునల్) స్పష్టం చేసిం ది. దీంతో బచావత్ -టైబ్యునల్ (కృష్ణా జల వివాదాల టైబ్యునల్-2) ఉమ్మడి రాష్ట్రాన్రికి కేటాయించిన కృష్ణా జలాల పున:పంపిణీపై ఎంతో కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది.
బచావత్ టైబ్యునల్ ఉమ్మడి రాష్ట్రాన్రికి కేటాయించిన 811 టీ-ఎంసీల పైనా, రాష్ట్ర పునర్విభజన సందర్భంగా 811 టీఎంసీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్ర కేటాయిం పులపైనా పున:సమీక్ష చేసే అవకాశమే లేదనీ, కృష్ణాలో 65 శాతం నీటి లభ్యతపై ఒనగరూరే అదనపు జలాల పంపిణీపైనే దృష్టి పెడతామని తేల్చి చెప్పింది.
ఏపీ ఎప్పటి నుంచో ఇదే వాదన వినిపిస్తున్నా తెలంగాణ మాత్రం ససేమిరా అంటోంది. కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతిపదికన పున:పంపిణీ చేయాలని పట్టుబడుతోంది. ఈ వాదన సాంకేతికంగా, న్యాయపరంగా, చట్టబద్దంగా సాధ్యం కాదని ఏపీ చేస్తున్న వాదనలకు ఇపుడు బ్రజేష్ కుమార్ టైబ్యునల్ నిర్ణయం బలం చేకూర్చినట్టయింది.
అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా కేవలం తాగునీటి ప్రాజెక్టుగా చూపెడుతూ పాలమూరు-రంగారెడ్డి పేరుతో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తుండటమే కాకుండా కృష్ణా నుంచి 90 టీఎంసీలకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ జల వనరుల శాఖ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ) రూపంలో టైబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన బ్రజేష్ కుమార్ టైబ్యునల్ కృష్ణా జలాల పున:పంపిిణీపై కీలక వ్యాఖ్యలు చేసింది.
2014 రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులో తమ పరిధి పరిమితం. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్ డబ్ల్యూఏ)- 1956 సెక్షన్-3, 5ల ప్రకారం పునర్విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు పూర్తయ్యాయని వెల్లడించింది.
కృష్ణాలో అదనపు జలాల లభ్యత ఉంటే నీటి కేటాయింపులు చేసే బాధ్యత చేపడతామనీ, బచావత్ టైబ్యునల్ కేటాయింపులపై పున:సమీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. దీంతో రెండు రాష్ట్రాల్రకు పంపిణీ చేసిన 811 టీఎంసీలు పోను 65 శాతం నీటి లభ్యత ఆధారంగా గుర్తించిన మరో 194 టీఎంసీల పంపిణీపైనే దృష్టి పెడతామని బ్రజేష్ కుమార్ టైబ్యునల్ వెల్లడించినట్టయింది.
More Stories
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ
తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు
నారా లోకేష్‌పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి