
ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవడం వలన బ్యాంకింగ్ సంక్షోభం కొంత కుదుటపడినా, అనిశ్చితి ఎక్కువగా ఉందని ఆమె స్పష్టం చేశారు.
బీజింగ్‌లో చైనా డెవలప్‌మెంట్ ఫోరమ్‌తో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు. అప్పులు ఎక్కువగా ఉండడం, దీర్ఘ కాలం పాటు తక్కువ వడ్డీ రేట్లు ఉండి షార్ట్ టర్మ్‌లోనే ఎక్కువ వడ్డీ రేట్లకు మారడం వంటి అంశాలతో అంతర్జాతీయ ఆర్ధిక రంగంపై ఒత్తిడి పెరుగుతుందని, ఈ రంగం బలహీనంగా మారుతోందని జార్జీవా తెలిపారు.
ద్రవ్యోల్భణంను ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లు పెరగాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. యూఎస్, యూరప్‌లోని బ్యాంకులు దివాలా బాటపడుతుండడమే ఇందుకు నిదర్శనమని ఆమె వివరించారు. అలానే తక్కువ ఆదాయ దేశాలపై ఫోకస్ పెట్టామని, ముఖ్యంగా ఎక్కువగా అప్పులు చేసిన దేశాలను గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
కాగా, యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా తీయగా, స్విస్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్‌ను యూబీఎస్ టేకోవర్ చేయాల్సి వచ్చింది. సిగ్నేచర్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ వంటి బ్యాంకులూ దివాలా తీయొచ్చు. తాజాగా డాయిచ్ బ్యాంక్‌పైనా అనుమానాలు పెరిగాయి. గ్లోబల్‌గా బ్యాంక్ షేర్లు పడుతున్నాయి.
ఆర్ధిక సుస్థిరత దెబ్బ తినకుండా చూసుకునేందుకు ప్రభుత్వాలు వేగంగా స్పందిస్తున్నాయని జార్జీవా చెప్పారు. కాగా, క్రెడిట్ స్వీస్‌ను యూబీఎస్ టేకోవర్ చేయడం ఒక్క రోజు ఆలస్యమైనా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం వచ్చేదని స్విట్జర్లాండ్ ఫైనాన్స్ మినిస్టర్ కరిన్ కెల్లర్ సట్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు బ్యాంకులకు ఫెడ్ భారీగా లిక్విడిటీ అందిస్తోంది. బ్యాంకింగ్ సంక్షోభాన్ని ఆపాలని ప్రయత్నాలు చేస్తోంది. ‘ఈ చర్యలన్నీ సంక్షోభాన్ని కొంత వరకు ఆపగలిగాయి. కానీ, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని జార్జీవా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనా ఎకానమీ బలీయంగా ఉందని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలలో చైనా ద్రువ తారగా వెలుగుతోందని ఆమె కొనియాడారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కూడా రికవరీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితులన్నీ బాగుంటాయని అనుకున్నా ప్రపంచ జీడీపీ బిరుద్ది ఈ ఏడాది, వచ్చే ఏడాది లాంగటర్మ్ యావరేజ్ 3.8 శాతం కంటే దిగువనే ఉంటుందని జార్జీవా అంచనా వేశారు. మొత్తమ్మీద ఆర్ధిక వ్యవస్థ బలహీనంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.
కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని అనుకున్నలోపే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని ఆమె పెక్రోన్నారు. ఈ యుద్ధం వలన గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 3 శాతం దిగువకు పడిపోయిందని ఆమె చెప్పారు. కాగా, ఈ ఏడాది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2.9 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
మరోవైపు చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 5.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. కరోనా ఆంక్షలను ఎత్తేయడంతో ప్రైవేట్ రంగం వినియోగం పుంజుకుంటోందని వివరించింది. చైనా ఎకానమీ గ్లోబల్ ఎకానమీకి మద్దతుగా ఉంటుందని జార్జీవా అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఎకానమీ గ్రోత్‌లో మూడో వంతు చైనా నుంచి ఉంటోందని ఆమె పేర్కొన్నారు.
‘చైనా జీడీపీ బిరుద్ది ఒక శాతం పెరిగితే, మిగిలిన ఆసియా దేశాల ఎకానమీ సగటున 0.3 శాతం పెరుగుతుంది. చైనా ఎకానమీ రికవరీ అవ్వడం ముఖ్యం’ అని ఆమె తెలిపారు. వినియోగ ఆధారిత ఎకానమీపై చైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని ఆమె సలహా ఇచ్చారు. ఫలితంగా ఎనర్జీ వాడకం తగ్గుతుందని, వాతావరణ మార్పు లక్ష్యాలను చేరుకోవడానికి వీలుంటుందని ఆమె వివరించారు.
చైనా తన ఉత్పాదికతను పెంచాలని ఆమె సూచించారు. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ కంపెనీలు సమాన స్థాయిలో పోటీపడేలా చేయడానికి అనుకూలమై సంస్కరణలు తీసుకురావాలని ఆమె సలహా ఇచ్చారు. విద్య కోసం పెట్టుబడులు పెంచితే ఎకానమీలో ఉత్పాదికత పెరుగుతుందని ఆమె తెలిపారు.
More Stories
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్
డ్రగ్ మాఫియా నెట్ వర్క్ ఛేదించిన ఎన్ సి బి