ఈజిప్ట్ ఆలయాల్లో వేలాది పశువుల పుర్రెలు

ఈజిప్టులోని ఆలయాల శిథిలాలకు సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు భారీ సంఖ్యలో పశువుల పుర్రెలు గుర్తించారు. ఫారో రామ్‌సేస్‌ ఆలయంలో రెండు వేలకుపైగా మమ్మీ చేసి భద్రపర్చిన గొర్రె తలలను గుర్తించినట్లు ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.  కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్‌, ముంగిసల మమ్మీలను కూడా న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిన అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞుల బఅందం అబిడోస్‌ వద్ద వెలికితీసింది.
అబిడోస్‌.. దక్షిణ ఈజిప్టులో ఆలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.  అమెరికన్‌ మిషన్‌ అధిపతి సమే ఇస్కందర్‌ మాట్లాడుతూ.. రామ్‌సేస్‌ మరణించిన 1,000 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఆరాధనను సూచిస్తూ ‘అర్పణలు’గా పవువులను బలి ఇచ్చి ఉండవచ్చుననితెలిపారు. క్రీ.పూ 1304 నుంచి 1237 వరకుదాదాపు ఏడు దశాబ్దాల పాటు రామ్‌సెస్‌ ఈజిప్టును పాలించాడు.
 
ఈ ఆవిష్కరణలు 2374-2140 బిసి మధ్య, టోలెమిక్‌ కాలం 323 నుంచి 30 బిసి వరకు రామ్‌సెస్‌ ఆలయం గురించి, అక్కడ జరిగిన కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయని ఈజిప్ట్‌లోని పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్‌ అధిపతి మోస్తఫా వాజిరి చెప్పారు.