
ఏపీలో వచ్చే ఎన్నికలనాటికి బిజెపి – జనసేన పొత్తు కొనసాగింపుపై వాదోపవాదాలు ఒకవంక కొనసాగుతుండగా, ఉగాది రోజున జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత జనసేన పార్టీ నుండి నిష్క్రమించి బిజెపి లో చేరారు. ప్రస్తుతం ఏపీలో జనసేన – బిజెపి పొత్తు కొనసాగుతుందని స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లోను ఇదే కొనసాగుతుందని అంత భావిస్తున్నారు. జనసేన అధికార ప్రతినిధి ఆకుల కిరణ్ కుమార్ బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలోనే ఈ పరిణామం జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలోనే బీజేపీలో చేరారు కిరణ్.
ఆకుల కిరణ్ కుమార్ విజయవాడకు చెందిన నేత. మీడియా సమావేశాల్లో, టీవీ డిబెట్స్‌లో జనసేన తరఫున పార్టీ వాణిని గట్టిగా వినిపించేవారు. పార్టీలో కొంతమంది నేతల తీరు సరిగాలేదని, వారు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఆ నేతల తీరు నచ్చకే రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుపై చర్చ జరుగుతున్న సమయంలో కిరణ్ పార్టీ మారడం ఆసక్తికరంగా మారింది.
More Stories
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ
తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు
నారా లోకేష్పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి