
ఆహార వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నా, తయారు చేసిన వస్తువులు, ఇంధనం, విద్యుత్ రేట్లు తగ్గడంతో ఈ జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయి 3.85 శాతానికి తగ్గింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు తగ్గడం ఇది వరుసగా తొమ్మిదో నెల.
డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జనవరిలో 4.73 శాతంగా ఉండగా, కిందటి ఏడాది ఫిబ్రవరిలో 13.43 శాతంగా ఉంది. ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఆహారేతర వస్తువులు, ఆహార ప్రొడక్టులు, ఖనిజాలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ,ఆప్టికల్ ప్రొడక్టులు, కెమికల్ ప్రొడక్టులు, ఎలక్ట్రికల్ పరికరాలు, వాహనాలు, ట్రైలర్ల ధరలు తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
2021 జనవరి తరువాత డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.85 శాతానికి తగ్గడం ఇదే మొదటిసారి. 2021 జనవరిలో ఇది 2.51 శాతం రికార్డయింది. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ కారణంగా ధరల్లో బాగా తగ్గుదల కనిపిస్తోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
కాగా, మార్కెట్ అంచనాలకు తగినట్లుగానే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమెరికా ద్రవ్యోల్భణం రేటు 6 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెల అంటే జనవరి 2023లో ఈ ద్రవ్యోల్భణం రేటు 6.4 శాతంగా రికార్డయింది. వార్షిక ద్రవ్యోల్భణం రేటు తగ్గడం ఇది వరసగా ఎనిమిదో నెల. ద్రవ్యోల్భణం గణాంకాలను అమెరికా కార్మిక శాఖ విడుదల చేసింది. అంచనాలకు తగినట్లుగానే ద్రవ్యోల్భణం రేటు ఉండటంతో అమెరికా మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే బాగా పుంజుకున్నాయి.
More Stories
పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం