తెలుగు పాట ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మొదటి సారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి. భారతదేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. దర్శకుడు రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు.
ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది. పాటకు సంగీతాన్ని కంపోజ్ చేసిన కీరవాణి, పాటను రాసిన చంద్రబోస్ స్టేజ్ ఎక్కి అవార్డును అందుకున్నారు. స్టేజ్‌పై కీరవాణి యావత్ భారత అభిమానులకు ధన్యవాాదాలను తెలియజేశారు.
95వ అకాడమీ అవార్డ్స్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగరిలో 81 పాటలు పోటీ పడ్డాయి. అందులో 15 పాటలు మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో నుంచి 5 పాటలను నామినేట్ చేశారు. ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎస్ఎస్ చిత్రంలోని నాటు నాటు పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి డాన్స్ చేయటం విశేషం.
ఈ పాటను రాజమౌళి 17 రోజుల పాటు చిత్రీకరించారు. వారం రోజుల పాటు పాటను రిహార్సల్ చేసి షూట్ చేశారు. 150 మంది డాన్సర్స్, 200 మంది యూనిట్ సభ్యులతో ఈ పాట చిత్రీకరణంతా సందడిగా సాగింది. ‘ఆర్.ఆర్.ఆర్’ మార్చి 24, 2022 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సంచలమం సృష్టించింది.
ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న నాటు నాటు పాటకు ఇప్పుడు ఆస్కార్ రావడంతో భారతీయ సినీ ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.
ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాట గెలుచుకుంది. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డు క్రిటిక్స్ చాయిస్‌ను కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్ సాంగ్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ నిలిచింది.
ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకున్నది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా హెచ్‌సీఏ అవార్డులు దక్కించుకున్నది. బెస్ట్ సాంగ్ విభాగంలో హ్యూస్టన్ ఫిల్మ్ క్రికెట్ సొసైటీ అవార్డును కూడా నాటు నాటు కైవసం చేసుకున్నది. అదేవిధంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డును సైతం ఈ పాట సొంతం చేసుకోవడం గమనార్హం.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు