మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆరోగ్యానికి నడక

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో భారీ ఆరోగ్యానికి నడక కార్యక్రమాన్ని  నిర్వహించింది. ఉమెరుగైన ఆరోగ్యం కోసం నడక కార్యక్రమంలో గొప్ప ఉత్సాహంతో, భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఆరోగ్య భారతదేశం కోసం అనే దృష్టిని అనుసరించి, వాక్‌థాన్, ఇలాంటి కార్యక్రమాలు పౌరులలో ఆరోగ్యకర ప్రవర్తనా మార్పులను తీసుకురావడానికి,మరింత శారీరకంగా చురుకైన జీవనశైలి గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించారు. అటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, సైకిల్ తొక్కడం పట్ల తనకున్న ఉత్సాహంతో “గ్రీన్ ఎంపీ”గా కూడా పిలువబడే కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం శారీరక శ్రమను ప్రోత్సహిస్తున్నారు.

 దేశంలో 63% కంటే ఎక్కువ మరణాలకు అంటురోగాలు కాని జబ్బులు కారణమవుతున్నాయి. పొగాకు వాడకం (ధూమపానం & పొగ రహితం), మద్యపానం అలవాటు, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, వాయు కాలుష్యం వంటి ప్రధాన ప్రవర్తన ప్రమాద కారకాలతో ఎక్కువ మరణాలకు కారణమవుతాయి. 

అంటురోగాలు కాని జబ్బులకు శారీరక బద్దకం ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. నేషనల్ ఎన్‌సిడి మానిటరింగ్ సర్వే (ఎన్‌ఎన్‌ఎంఎస్) (2017-18)లో కూడా 41.3% భారతీయులు శారీరకంగా నిష్క్రియంగా, నిశ్చలంగా ఉన్నారని తేలింది. శారీరక శ్రమ ఆరోగ్య ప్రయోజనాలు హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైన అంటురోగాలు కాని జబ్బులను తగ్గించటం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుంది.

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శారీరక, మానసిక శ్రేయస్సు, పర్యావరణ అనుకూలమైన రవాణాను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయంలో ఆదివారం సైక్లింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ‘ఆరోగ్యకరమైన మహిళలు ఆరోగ్య భారతదేశం’ అనే థీమ్‌తో సైక్లాథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.