ప్రమాదం అంచుల్లో చెన్నై, కోల్‌కతా నగరాలు

పర్యావరణ అసమానతల వలన సముద్ర మట్టం భారీగా పెరిగి, ఆసియా ఖండంలోని కొన్ని ప్రధాన నగరాలతో పాటు పశ్చిమ ఉష్ణమండల పసిఫిక్‌ దీవులు, పశ్చిమ హిందూ మహాసముద్రం తీవ్ర తీవ్రమైన ముప్పును ఎదుర్కోనున్నాయి.  2100 నాటికి వాతావరణంలోకి అధిక స్థాయిలో గ్రీన్‌హౌస్‌ వాయువులను విడుదల అవ్వడం కొనసాగినట్లయితే, అనేక ఆసియా నగరాలు గణనీయమైన నష్టాలను చవిచూస్తాయని నేచర్‌ క్లెమేట్‌ ఛేంజ్‌ అనే జర్నల్‌లో హెచ్చరించింది.
 
ఆసియ ప్రధాన నగరాలైన చెన్నై, కోల్‌కతా, యంగూన్‌, బ్యాంకాక్‌, హోచి మిన్‌ సిటీ, మనీలాలు సముద్రమట్టం పెరుగుదల ముంపును ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా అంచనా వేసిన పెరుగుదలపై సహజ సముద్ర మట్టాల హెచ్చుతగ్గుల ప్రభావాలను అధ్యయనం పరిశీలించింది.
 
 ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం హాట్‌స్పాట్‌లను మ్యాపింగ్‌ చేయడం ద్వారా పలు విషయాలను అధ్యయనం తెలిపింది. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. సముద్ర జలం వేడెక్కడం ద్వారా మంచు పలకలు కరిగి సముద్రాలలోకి ఎక్కవ నీరు విడుదల చేస్తాయి.
 
ఈ అధ్యయనంలో గుర్తించదగినది ఏమంటే, ఎల్‌ నినో వంటి సంఘటనల వల్ల సహజంగా సంభవించే సముద్ర మట్ట హెచ్చుతగ్గులు లేదా నీటి చక్రంలో మార్పులు, అంతర్గత వాతావరణ వైవిధ్యం అనే ప్రక్రియను జర్నల్‌ ప్రస్తావించింది.
 
 అధ్యయనం ప్రకారం, ప్రపంచ వాతావరణం కంప్యూటర్‌ మోడల్‌, ప్రత్యేకమైన గణాంక నమూనా రెండింటినీ ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ సహజ హెచ్చుతగ్గులు నిర్దిష్ట తీరప్రాంతాల వెంబడి సముద్ర మట్టం పెరుగుదలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎంతవరకు పెంచగలరో లేదా తగ్గించగలరో నిర్ణయించగలరు. అంతర్గత వాతావరణ వైవిధ్యం కొన్ని ప్రదేశాలలో సముద్ర మట్టం పెరుగుదలను కేవలం వాతావరణ మార్పుల వల్ల వచ్చే దానికంటే 20-23 శాతం ఎక్కువగా పెంచుతుందని, విపరీతమైన వరదల జోరును పెంచుతుందని అధ్యయనం తెలిపింది. మనీలాలో కేవలం వాతావరణ మార్పుల ఆధారంగా 2006 కంటే 2100 నాటికి తీరప్రాంత వరదలు 18 రెట్లు ఎక్కువగా సంభవిస్తాయని అంచనా వేశారని అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పియరిక్‌ రీసెర్చ్‌(ఎన్‌సీఏఆర్‌) ఆధారిత కమ్మూనిటీ ఎర్త్‌ సిస్టమ్‌ మోడల్‌తో నిర్వహించిన అనుకరణల సమితిపై ఆధారపడింది. సమాజ గ్రీన్‌హౌస్‌ వాయువులు ఈ శతాబ్దంలో అధిక రేటుతో విడుదల కానున్నాయని అధ్యయనం పేర్కొంది.