ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. మద్యం వ్యాపారవేత్త, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ ధాల్ ను ఇడి అదుపులోకి తీసుకుంది. నిందితుడు క్రెడిట్ నోట్, పాలసీ ఫార్ములేషన్-లో భాగస్వామి అయినట్లు ఇడి గుర్తించింది. సాక్ష్యాధారాల ఆధారంగా అమన్ దీప్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.
 
మూడు రోజుల కింద ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 8 గంటల పాటు విచారించిన సీబీఐ అనంతరం అరెస్ట్ చేశారు. అయితే సిసోడియా అరెస్ట్ అనంతరం తదుపరి అరెస్ట్ ఎవరనేది తీవ్ర చర్చనీయాంశం కాగా, అమన్ దీప్ ధాల్ ను అరెస్ట్ చేశారు.
 
నిందితుడు క్రెడిట్ నోట్, పాలసీ ఫార్ములేషన్‭లో ఇన్వాల్వ్ అయినట్లు ఈడీ గుర్తించింది. సాక్ష్యాధారాల ఆధారంగా అమన్ దీప్ ధాల్ పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అమన్ ధీప్ ను రౌస్ ఎవిన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు.  అతడికి సౌత్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
 
విచారణ కోసం అమన్ ధీప్ ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. కాగా సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వారిలో మన్ దీప్ ఒకరు. అభిషేక్ బోయిన పల్లి, విజయ్ నాయర్, మనోజ్ రాయ్, సమీర్ మహేంద్రు, అమన్ దీప్ లిక్కర్ పాలసీ తయారీలో చురుకుగా పాల్గొన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఈడీ అమన్ దీప్ ను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
 
ఇదిలా ఉంటే ఈ కేసులో భాగంగా ఈడీ ఇటీవల దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిల పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
 
ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆ సమయంలో ఆప్  గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కూడా కవిత పేరును ఈడీ పేర్కొంది.