పశుసంవర్ధక రంగంలో పెట్టుబడులు మరింత పెరగాలి

పశుసంవర్ధక రంగంలో  పెట్టుబడులు మరింత పెరగాలని కేంద్ర మత్స్య, కేంద్ర పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సూచించారు.  పశుసంవర్ధక రంగం  మరింత అభివృద్ధి సాధించేలా చూసి,   పశు పోషణ రంగంలో ఉన్న  రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించి ఈ రంగం మరింత లాభదాయకంగా మార్చడానికి అన్ని వర్గాలతో   కలిసి పనిచేయడానికి కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ  పశుసంవర్ధక రంగాల్లో ఇప్పటికే పనిచేస్తున్న,  అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి  తెలంగాణ రాష్ట్ర  పశుసంవర్ధక శాఖ, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు,  స్టార్టప్ ఇండియా, సిఐఐ సహకారంతో హైదరాబాద్ లో కేంద్ర పశుసంవర్ధక , పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన  గ్రాండ్ స్టార్టప్ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. 

కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ మాట్లాడుతూ దేశంలో పశుసంవర్ధక రంగం ప్రాధాన్యత, రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను  ప్రస్తావించారు.

తక్కువ ఉత్పత్తి, వ్యాధుల రూపంలో పశుసంవర్ధక రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇతర మంత్రిత్వ శాఖలు, సంబంధిత వర్గాలతో కలిసి కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తున్నదని చెప్పారు.  సమస్యల పరిష్కారం తో పాటు వ్యవస్థాపక శక్తి, సాంకేతిక అంశాలు, డిజిటలీకరణ, వినూత్న ఆలోచనలకు మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.  పశుసంవర్ధక రంగంలో ఉన్న రైతులు, పారిశ్రామికవేత్తల ఆదాయం ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పని చేస్తూ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

శాస్త్రీయ చర్యల ద్వారా పశుసంవర్ధక రంగంలో మార్పులు తీసుకు వచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు అమలు చేయడం ప్రారంభించిందని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తెలిపారు. లక్ష్యాలు సాధించడానికి పడే విధంగా వేగంగా ప్రణాళిక అమలు జరిగేలా చూడడానికి అన్ని వర్గాలు సహకరించాలని  కోరారు. అన్ని వర్గాల నుంచి అందే సలహాలు, సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన విధానానికి రూపకల్పన చేస్తామని చెప్పారు.

ప్రపంచ మాంసం ఎగుమతుల రంగంలో భారతదేశం 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల రంగంలో 3వ స్థానంలో ఉందని డాక్టర్ మురుగన్ తెలిపారు. దేశంలో పాడి పరిశ్రమ, పశు సంవర్ధక రంగంలో అభివృద్ధి సాధిస్తున్నాయని, ఈ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.  హైదరాబాద్‌లో స్టార్టప్‌ల సదస్సు నిర్వహించిన మంత్రిత్వ శాఖను తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి  టి.శ్రీనివాస్ యాదవ్   అభినందించారు.