ప్రధానంగా డిజిటల్ ఎకనామిలో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈ-కామర్స్, ఇతర డిజిటల్ చెల్లింపులు, సర్వీసెస్ సిగ్మెంట్ వృద్ధి అధారపడి ఉందని కామత్ చెప్పారు. 2029 నాటికి డిజిటల్ ఎకనామి వాటా 25 శాతానికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. చైనాలో ప్రస్తుతం జీడీపీలో డిజిటల్ ఎకనామి వాటా 40 శాతంగా ఉందని, దీన్ని మనం చేరుకుంటామని తెలిపారు.
దేశంలో మరిన్ని ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, హై స్పీడ్ రైలు మార్గం వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఎక్కువ ఆసక్తిగా ఉన్నందున ఆర్ధిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని కామత్ అభిప్రాయపడ్డారు.
పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం చాలా ఉందని, దీన్ని కొన్ని పట్టణాలకే పరిమితం చేయకూడదని ఆయన చెప్పారు. మన ఆర్ధిక వ్యవస్థలో మరిన్ని ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు రావాల్సి ఉందని తెలిపారు. ఇలాంటివి వస్తే ప్రస్తుతం ఉన్న జీడీపీ రెట్టింపు అవుతుందని ఆయన చెప్పారు.
కొంత కాలంగా బ్యాంక్‌ల పనితీరు మెరుగుపడిందని, నిరర్ధక ఆస్తులు తగ్గుతున్నాయని, ఆస్తుల నిర్వహణలో నాణ్యత పెరిగిందని, ఈవన్నీ ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు సంకేతాలని ఆయన వివరించారు.
More Stories
రాంగోపాల్ వర్మకు చెక్బౌన్స్ కేసులో జైలు శిక్ష!
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు