అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అస్త్ర ఎయిర్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ను మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలో ఫ్లైట్‌ టెస్ట్‌ నిర్వహించినట్లు తెలిపింది. ఎస్‌యూ-30ఎంకేఐ ఫైటర్‌ జెంట్‌ నుంచి ప్రయోగించే క్షిపణి వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదని రక్షణ వర్గాలు తెలిపాయి.
 
అస్త్ర క్షిపణి వ్యవస్థ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్ 1ఎ యుద్ధ విమానం, మిగ్-29 జెట్‌ అప్‌గ్రేడ్ వెర్షన్లలో బిగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.  అస్త్ర మిస్సైల్‌ స్వదేశంలో అభివృద్ధి చేసిన విజువల్ రేంజ్ బియాండ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి. ఈ క్షిపణి 80 కిలోమీటర్ల నుంచి 100కుపైగా కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది.
 
అదే సమయంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు పయనించగలదని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. అస్త్ర క్షిపణిని డీఆర్డీవో అభివృద్ధి చేస్తుండగా.. బీడీఎల్‌ అభివృద్ధి చేయనున్నది. ఎయిర్ పోర్స్, నేవీలో మోహరించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ క్షిపణులను తయారు చేసే సాంకేతికత అందుబాటులో లేదు. ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) అవసరాల ఆధారంగా విజువల్ రేంజ్ క్లోజ్ కంబాట్ ఎంగేజ్‌మెంట్‌ కోసం అస్త్ర క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది.
 
 బీవీఆర్‌ సామర్థ్యంతో ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు ప్రత్యర్థి ఎయిర్‌క్రాఫ్ట్ లను విజయవంతంగా అడ్డుకోగలవు. తద్వారా గగనతలంలో ఆధిక్యతను సాధించవచ్చు. ఈ క్షిపణి వ్యవస్థ మిగిలిన వాటి కంటే సాంకేతికంగా ముందువరుసలో ఉన్నది.