దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ప్రముఖ అవార్డు దక్కించుకొని వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా అజయ్ దేవగన్ , శ్రీయ లతో పాటు హాలీవుడ్ నటి నటులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది.
ఇప్పటికే ఈ ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ దక్కించుకున్న ఈ చిత్రం తాజాగా భారత చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది. అలాగే కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న కాంతార సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును రిషబ్ శెట్టి దక్కించుకున్నాడు.
ఇక ఉత్తమ చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ , ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్ ( బ్రహ్మస్త్ర 1), ఉత్తమ నటిగా ఆలియాభట్ (గంగూబాయి కథియావాడీ) అవార్డు సొంతం చేసుకున్నారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేతలు
ఉత్తమ దర్శకుడు – ఆర్. బాల్కి (చుప్ )
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – వరుణ్ ధావన్ (బేడియా )
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ – అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – సాచిత్ తాండన్
క్రిటిక్స్ ఉత్తమ నటి – విద్యాబాలన్ (జల్సా )
ఉత్తమ సహాయ నటుడు – మనీష్ పాల్ (జగ్ జగ్ జియో )
టెలివిజన్ /ఓటీటీ విభాగాల్లో
ఉత్తమ నటుడు – జైన్ ఇమనాన్ ( ఇష్క్ మే మర్‌జావా )
ఉత్తమ నటి – తేజస్వి ప్రకాశ్ ( నాగిన్ )
ఉత్తమ సహాయ నటి – షీబా చద్దా
ఉత్తమ వెబ్ సిరీస్ – రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
ఉత్తమ వెబ్‌సిరీస్ నటుడు : జిమ్ షార్బ్ ( రాకెట్ బాయ్స్ )
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : అనుపమ
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి