తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన రెస్పాండ్ కావడం లేదు. మునపటి కంటే మరింతగా ఆయన ఆరోగ్యం విషమంగా మారిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హాస్పటల్ కు చేరుకుంటున్నారు.
ఆరు రోజుల క్రితం విదేశాల నుంచి ముగ్గురు వైద్యులు వచ్చారు. ఈ ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో తారకరత్న బ్రెయిన్‌కి చికిత్స అందిస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రెండు రోజులకొకసారి ఎంఆర్‌ఐ స్కాన్ తీస్తున్నారు. అయితే ఆ రిపోర్టు వివరాలను కానీ, హెల్త్ బులెటిన్ లను విడుదల చేయలేదు.
ఇప్పటివరకూ తారకరత్నకి సంబంధించి.. రెండు హెల్త్ బులిటెన్స్ మాత్రమే విడుదల చేశారు. ఆ రెండు కూడా తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. అందులో ఎక్మో ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదని తెలియజేశారు. అయితే తారకరత్న బ్రెయిన్‌కి సంబంధించిన ఎలాంటి కదలికలు లేకపోవడంతో.. ఆయనకి చికిత్స అందిస్తూనే ఉన్నారు
23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి తారకరత్న కు చికిత్స అందజేస్తూ వస్తున్నారు.

More Stories
డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలపై సీబీఐ విచారణ
విశాఖ ఉక్కు ప్రమాదంపై నివేదిక కోరిన ఎన్ హెచ్ ఆర్ సి
విద్యార్థుల కఠోర శ్రమ, అంకితభావం, నిబద్ధత ఫలితమే డిగ్రీలు