త్రిపురలో బీజేపీ- సిపిఎంల మధ్య అధికారంకోసం తీవ్రంగా జరిగిన ఎన్నికల పోరులో గురువారం భారీగా 92.40 శాతం వరకు పోలింగ్ జరగడం అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తున్నది. చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
గురువారం జరిగిన పోలింగ్ ప్రక్రియకు ఉదయం ఏడు గంటల నుండే ఓటర్లు బారులుదీరారు. ప్రారంభమైన మొదటి గంట నుండే పోలింగ్ స్టేషన్లు కిక్కిరిసి కనిపించాయి. దీంతో గంట,గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు గంటలకు పోలింగ్ ప్రక్రియను ముగించారు. ఆ సమయానికి 81.10 శాతం ఓట్లు పోల్ అయినట్లు ఎనిుకల కమిషన్ ప్రకటించింది.
ఆ సమయానికి కూడా పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారందరికీ ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. దీంతో భారీగా ఓటింగ్ శాతం పెరగనుంది. అనధికారిక వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం రాత్రి పొద్దుపోయే సమయానికి 92.40 శాతం ఓటింగ్ నమోదయింది. ఇది త్రిపుర చరిత్రలోనే రికార్డు. పూర్తిస్థాయి ఓటింగ్ శాతాన్ని శుక్రవారం ఎనిుకల కమిషన్ ప్రకటించనుంది.
కాగా, భారీ సంఖ్యలో తరలివస్తును ఓటర్లను అడ్డుకోవడానికి పలుచోట్ల బిజెపి ప్రయతిుంచిన్నట్లు సిపిఎం నేతలు ఆరోపించారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందనిముఖ్య ఎన్నికల అధికారి గిట్టె కిరణ్ కుమార్ దినకర్ రావు ప్రకటించారు. రెండు దశాబ్దాల క్రితం మిజోరాం నుండి త్రిపురకు వలస వచ్చేసిన బ్రూ తెగకు చెందిన కుటుంబాలు మొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేశాయి.
త్రిముఖ పోటీ జరుగుతున్న త్రిపురలో 259 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 45 చోట్ల ఇవిఎంలు పనిచేయలేదు. రాష్ట్ర రాజకీయాలలో చిరకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సిపిఎం, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకొని, ఉమ్మడి ప్రత్యర్థి బిజెపిని అధికారంనుండి దించేయడంకోసం ఒకటిగా పోటీచేశాయి.
ప్రచారం సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు సహా రూ. 45 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లకు పంచడానికి స్వాధీనం చేసుకున్న వస్తువులు 20 రెట్లు ఎక్కువని ఎన్నికల సంఘం తెలిపింది
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష