ఐదేళ్లలో రెండు లక్షల సహకార సంఘాలు

రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల బహుళ ప్రయోజన పిఎసిఎస్‌, డెయిరీ, మత్స్య సహకార సంఘాలను స్థాపించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, అట్టడుగు స్థాయి వరకు దాని పరిధిని పెంచడానికి ఆమోదం తెలిపింది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, ఎస్‌ మురుగన్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.

ప్రతి పంచాయతీలో ఆచరణీయ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్‌), ప్రతి పంచాయతీ, గ్రామంలో ఆచరణీయ పాల సహకార సంఘాలు, ప్రతి తీరప్రాంత పంచాయతీ, గ్రామాలు, పెద్ద నీటి వనరులును పంచాయతీ, గ్రామాల్లో ఆచరణీయ మత్స్య సహకార సంఘాలు, ప్రస్తుతమును పిఎసిఎస్‌, డెయిరీ, మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు.

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖకు సంబంధించిన వివిధ పథకాలు నాబార్డ్‌, నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డిడిబి), నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌ఎఫ్‌డిబి) మద్దతుతో ‘మొత్తం ప్రభుత్వ’ విధానాన్ని ఉపయోగించి ఏకీకృతం చేసి, అమలు చేస్తామని పేర్కొన్నారు.

పిఎసిఎస్‌, డెయిరీ, మత్స్య సహకార సంఘాలు తమ పారిశ్రామిక కార్యకలాపాలను వైవిధ్యపరచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, ఆధునీకరించడానికి ప్రారంభమవుతాయని తెలిపారు. రైతు సభ్యులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేయడానికి, ఆదాయాన్ని పెంచడానికి, గ్రామ స్థాయిలో రుణ సౌకర్యాలు, ఇతర సేవలను పొందేందుకు అవసరమైన యంత్రాంగాలు సృష్టించనున్నట్లు పేర్కొన్నారు.