అమృత్ పెక్స్ 2023 – జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శన

తపాలా శాఖ దాదాపు దశాబ్దం తరువాత జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శన- అమృత్ పెక్స్ – 2023  ను నిర్వహించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల లో భాగంగా 2023 ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ అమృత్ పెక్స్ – 2023ను తపాలా శాఖ ఏర్పాటు చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఫిలాటెలిక్ కాంగ్రెస్ తో సంప్రదించి అమృత్ పెక్స్ – 2023 ను నిర్వహించారు.  పిల్లలు , యువతకు దృశ్య , ఇంటరాక్టివ్ ట్రీట్ గా ఈ ఈ ఎగ్జిబిషన్ కు రూపకల్పన చేశారు.

స్టాంపులు, లెటర్ రైటింగ్, వర్చువల్ డిస్ ప్లేల ద్వారా భారతదేశ  గొప్ప సంస్కృతి, వారసత్వం, చరిత్ర, ప్రకృతి, వన్యప్రాణులు విజయాలను ఈ ప్రదర్శన ముందుకు తెచ్చింది. ఈ ఎగ్జిబిషన్ విజేతలకు వివిధ అంతర్జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్లలో పాల్గొనడానికి వారి సేకరణలను ప్రదర్శించడానికి ఒక అవకాశం. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్  హాల్ నెం.5లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో 500 మంది ఫిలాటెలిస్టుల నుంచి పోటీ, ఆహ్వానిత విభాగాలలో 20,000కు పైగా స్టాంపులు మొదలైనవి ప్రదర్శించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోని ఐదు థీమ్ తో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 200 కి పైగా ఫిలటెలిక్ ఫ్రేమ్ లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇండియా పోస్ట్ మార్పు ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఇండియా పోస్ట్  కొత్త డిజిటల్ సర్వీసెస్  లైవ్ కౌంటర్లు, సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన పోస్టల్ సేవల ఇంటరాక్టివ్ హ్యూమన్ స్టోరీలు, స్థానిక, వెలుగలోకి రాని ప్రముఖుల విశేషాలు, ఫిలటెలీని సాఫ్ట్ డిప్లొమసీ సాధనంగా హైలైట్ చేసే జీ20 పెవిలియన్ ఈ ఎగ్జిబిషన్ లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

ఈ ఐదు రోజుల ఎగ్జిబిషన్ లో పలు వర్క్ షాప్ లు, సెమినార్లు, ప్యానెల్ డిస్కషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం కార్యక్రమాలు, స్మారక పోస్టల్ స్టాంపుల విడుదల, ప్రత్యేక కవర్లు, పిక్చర్ పోస్ట్ కార్డుల విడుదల నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో 25,000 మందికి పైగా పిల్లలు, స్టాంప్ ప్రేమికులు, పర్యాటకులు పాల్గొన్నారు.

ఢిల్లీ ఎన్ సి ఆర్ లోని 125కు పైగా పాఠశాలలకు చెందిన పిల్లలు ఎగ్జిబిషన్ ను సందర్శించి లెటర్ రైటింగ్, ఆర్ట్ అండ్ పెయింటింగ్, కాలిగ్రఫీ, మండల ఆర్ట్, స్టాంప్ డిజైన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ స్టాంపుల ద్వారా న్యూ ఇండియా ఆలోచనను వివరించే వర్చువల్ రియాలిటీ గ్యాలరీ పిల్లలు , ఇతర సందర్శకులలో పెద్ద విజయాన్ని సాధించింది.

కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” స్మారక పోస్టల్ స్టాంపును మంత్రి విడుదల చేశారు.  రెండు రోజుల వ్యవధిలో వివిధ పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవడం ద్వారా 10 లక్షల మందికిపైగా ఆడపిల్లల భవిష్యత్తును కాపాడిన రికార్డును మంత్రి జాతికి అంకితం చేశారు.

డిపార్ట్ మెంట్ ఈ చొరవను ప్రధాన మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభినందించారు. ఎగ్జిబిషన్ లో భాగంగా నారీ శక్తి, యువశక్తి, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా, అన్ సంగ్ (వెలుగు లోకి రాని) హీరోలపై ప్రత్యేక కవర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘ఫ్లేవర్స్ ఆఫ్ ఢిల్లీ’ పిక్చర్ పోస్టు కార్డుల సెట్ ను కూడా విడుదల చేశారు. ఎగ్జిబిషన్ రెండో రోజు ప్రముఖ కథక్ నృత్యకారిణి షోవానా నారాయణ్ సమక్షంలో ‘బ్రైడల్ కాస్ట్యూమ్స్ ఆఫ్ ఇండియా’పై 8 సెట్లను విడుదల చేశారు.

దేశంలో జిఐ ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో దాని పాత్రను పెంచుతూ, ఈ కార్యక్రమంలో, సావనీర్ షీట్ “జియోగ్రాఫికల్ ఇండికేషన్స్:” లో 12 స్మారక స్టాంపుల సెట్, వ్యవసాయ సామాగ్రిని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అనురాగ్ జైన్ మాట్లాడుతూ, గత 7-8 సంవత్సరాలలో ఇండియా పోస్ట్ మార్పు, జి 2 సి సేవలలో దాని పెరుగుతున్న ప్రాముఖ్యత , భారత ప్రభుత్వ వివిధ కార్యక్రమాల చివరి మైలు అమలును ప్రశంసించారు.

అమృత్ పెక్స్ – 2023 కు దృష్టి లోపం ఉన్న సందర్శకుల కోసం సెన్సర్ జోన్ తో దివ్యాంగ స్నేహిత ప్రదర్శనగా గుర్తింపు వచ్చింది. బ్రెయిలీలో ప్రత్యేక లేఖ రాసే పోటీ నిర్వహించారు. వినికిడి లోపం ఉన్నవారికి అన్ని దశలు అందుబాటులో ఉండేలా సైన్ లాంగ్వేజ్ నిపుణుడిని వేదికపై ఉంచారు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి డాక్ ఘర్ నాటకం, బాలభవన్ నృత్య ప్రదర్శన, జషాన్ ఇ అదాబ్  కవి సమ్మేళనం, ఉత్సద్ షుజాత్ ఖాన్ సితార్ ప్రదర్శన, పీయూష్ మిశ్రా రచించిన బల్లిమారన్ ప్రాజెక్టు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. తోలుబొమ్మ ప్రదర్శన, యూత్ పార్లమెంట్ ఇతర ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

 ఐదు రోజుల  ఈ ఎగ్జిబిషన్ చివరి రోజున ‘పోస్టల్ సర్వీసెస్: ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధి, అనుసంధానం కోసం ఒక సాధనం’ అనే అంశంపై అంతర్జాతీయ రౌండ్ టేబుల్, ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు.