
ఇకపై ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా పాశ్చాత్య దేశాల వ్యాపార ప్రోత్సాహ సంస్కృతిని మనం ఈ మధ్య అలవాటు చేస్తూకొంటున్నాము. అయితే, ఆ రోజును “గోమాతల ఆలింగనం రోజు”గా (Cow Hug Day) పాటించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచించింది. గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆనందానుభూతి కలుగుతుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది.
అందుకనే ఫిబ్రవరి 14న అవును కౌగలించుకోవాలని భారత జంతు సంక్షేమ బోర్డు ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఈరోజుకు `గోమాతల ఆలింగనం రోజు’ అని పేరు కూడా పెట్టింది. విదేశాల్లో గోమాతల ఆలింగానానికి డాలర్లు కూడా వసూలు చేస్తున్నారు. గోవుల సమక్షానికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కూడా పరిశోధనల్లో తేలింది.
ఆవు పాలు శ్రేష్ఠమని కూడా వైద్యులు చెబుతుంటారని, గోమాత ఎక్కడ పూజింప బడుతుందో అక్కడ సిరిసంపదలు విరాజిల్లుతాయని కేంద్ర పశు సంవర్ధక బోర్డు తెలిపింది. భారత సంస్కృతికి, గ్రామీణ భారతానికి వెన్నెముకలా గోమాత నిలుస్తుందని అభిప్రాయపడింది. గో మూత్రం కీటక నాశినిగా పనిచేస్తుంది. ఆవు పేడలో క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
గోవు పాలు, పెరుగు, నెయ్యిలో ఔషధ గుణాలుంటాయి. తల్లిపాలు లేని వారికి ఆవుపాలు పట్టిస్తుంటారు. ఆవు పాలు ఉదర సంబంధమైన జబ్బులు తగ్గిస్తాయి. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా ఫిబ్రవరి 14ను పాశ్చాత్య దేశాల్లో వ్యాలంటైన్స్‌డేగా జరుపుకుంటున్నారు. భారత దేశంలో కూడా వ్యాలంటైన్స్ డేను ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు.
అయితే మన భారత సంస్కృతికి, వ్యాలంటైన్స్‌డేకి ఏ మాత్రం సంబంధం లేదని సంప్రదాయవాదులు చెబుతుంటారు. ఆవులని కౌగిలించుకోవడంతో మానసిక స్థైర్యంతో పాటు వ్యక్తిగత, సామాజిక ఆనందాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. భారత దేశ సాంప్రదాయాలు అంతరించిపోవడానికి విదేశీ సంస్కృతి కారణం అవుతోందని, దేశ సంస్కృతిని కాపాడేందుకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే గా జరుపుకోవాలని కోరింది.
భారత దేశ సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి గోమాతను పూజించుకోవాలని సూచించింది. పోషకాహార స్వభావం ఉన్నందున దీనిని “కామధేను, గౌమాత గా అని పిలుస్తారని పేర్కొంది. భారత జంతు సంక్షేమ బోర్డు. కేంద్ర ప్రభుత్వంలోని పశు సంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ క్రింద ఒక చట్టబద్ధమైన సంస్థ. జంతు సంరక్షణ కోసం చట్టపరమైన నిబంధనలను సూచించడం దీని ప్రధాన విధి.
“ఆవుకు గల అపారమైన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆవును కౌగిలించుకోవడం వల్ల మానసిక ఐశ్వర్యం సమకూరుతుంది. తద్వారా మన వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుంది. కాబట్టి, ఆవు ప్రేమికులందరూ కూడా ఫిబ్రవరి 14ని కౌ హగ్ డేగా జరుపుకోవచ్చు. తల్లి ఆవు ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి. జీవితాన్ని సంతోషంగా , సానుకూల శక్తితో నింపండి” అంటూ ఈ సందర్భంగా ఈ బోర్డు ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఆవు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యమైనది కావడమే కాకుండా, హిందూ ధార్మిక, సామాజిక వ్యవస్థలో సహితం చాల పవిత్రమైనదిగా భావిస్తుంటాము. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గోసంరక్షణ పట్ల విశేష ఆసక్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్నాయి. పలు రాష్ట్రాలలో గోసంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేబడుతున్నారు. గోసంరక్షణ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు.
More Stories
గూడ్సు పట్టాలు తప్పలేదు.. కోరమాండల్ రైలే ఢీకొట్టింది
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ