అదానీపై జరిగిన కుట్ర వెనుక అజీమ్ ప్రేమ్‌జీ!

ప్రపంచంలోని సంపన్నులలో మూడో వ్యక్తిగా ఎదిగిన భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన కంపెనీల ఆర్ధిక వ్యవహారాలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్నివేదిక వెలువడగానే ఆ కంపోయానేలా షేర్ల విలువగా భారీగా పడిపోవడం, ఆ కంపెనీలకు పెట్టుబడులు సమకూర్చిన పలు ఆర్ధిక సంస్థలు, బ్యాంకులలో ఆందోళన చెలరేగడం, దీనిని సాకుగా తీసుకొని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత దాడులకు దిగడం జరుగుతుంది.
 
ఈ నివేదిక వాస్తవికతకు సంబంధించి ఒక వంక పలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండగానే, మరోవంక దీని వెనుక మనదేశానికి చెందిన వర్గాల నుండే భారీ కుట్ర ఉన్నదనే కధనాలు వెలువడుతున్నాయి. తాజాగా అదానీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ సూత్రధారి అనే ఆరోపణలు చెలరేగుతున్నాయి.
 
ఈ విషయమై హిందీ దినపత్రిక అమర్ ఉజాలా ప్రచురించిన సంచలన కధనాన్ని ఆధారం చేసుకొని ప్రముఖ జాతీయ ఆంగ్ల వారపత్రిక ఆర్గనైజర్ సవివరమైన కధనాన్ని వెలువరించింది. ఈ విషయాన్నీ భారత ప్రభుత్వం సహితం తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది.  ఈ కధనాల ప్రకారం హిండెన్‌బర్గ్ వెనుక జర్నలిస్ట్ అయినా ఓ ప్రముఖ కమ్యూనిస్ట్ నేత  భార్య, ఒక ఎన్జిఓ నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, వామపక్ష వెబ్‌సైట్ ఉందని చెబుతున్నారు. వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ సంబంధించిన ట్రస్ట్ నుండి భారీగా నిధులు సమకూరుస్తూ ఉండటం గమనార్హం.
అదానీకి వ్యతిరేకంగా, ఆస్ట్రేలియా లోని పర్యావరణ అంశాలపై పనిచేస్తుందని చెప్పే ఎన్జిఓ బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బిబిఎఫ్) అదానీవాచ్.ఆర్గ్ (Adaniwatch.org) అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దీనిని ప్రారంభించామని అప్పట్లో చెప్పిన్నప్పటికీ, ఇప్పుడు అదానీ చేపట్టే ప్రతి ఆర్ధిక కార్యకలాపంపై విషప్రచారం చేయడంలో నిమగ్నమై ఉంది.
 
 అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్, సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తుండటం గమనార్హం. నిజంగా పర్యావరణ సమస్యలపైననే ఈ ఎన్జిఓ పనిచేస్తుంటే ఎన్డిటివి నుండి రవిష్ కుమార్ నిష్క్రమించడం, ప్రధాని మోదీపై బిబిసి డాక్యూమెంటరీలను విడుదలచేయడం వంటి అంశాలపై స్పందించవలసిన అవసరం ఎందుకు ఉంటుంది?
 
కేవలం బిజెపి పాలిత రాష్ట్రాలలో అదానీ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్ట్ లపైననే లక్ష్యంగా వీరు విషప్రచారం చేస్తుండటం, కాంగ్రెస్, టిఎంసి, ఇతర బిజెపి వ్యతిరేక పక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాలలో అదానీ ఆర్ధిక కార్యకలాపాల గురించి మౌనం వహిస్తూ ఉండటం జరుగుతుంది. అంటే, అదానీ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీపై వీరు గురిపెట్టిన్నట్లు స్పష్టం అవుతుంది.
 
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ , బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ చేసిన కుట్రను ఈ కుట్ర పొలిఉన్నట్లు వెల్లడవుతుంది. ‘హిండెన్‌బర్గ్’ కేవలం ఓ పాత్రధారి మాత్రమే అని, అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ, అతని కోసం పనిచేస్తున్న వామపక్ష బృందాలనే ఆరోపణలు చెలరేగుతున్నాయి.
 
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భార్య అయిన ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ అదానీపై కుట్రలో చురుగ్గా పాల్గొంటున్నారని చెబుతున్నారు. “ది వైర్” భారత్ వ్యతిరేక ఎన్జిఓ  నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. సీమా చిస్తీ ఆ ఎన్జిఓకు మీడియా ఫెలోషిప్ సలహాదారు. ది వైర్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా (ఎన్ఎఫ్ఐ)తో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకోండి, ఇది సోరోస్, ఫోర్డ్, బిల్ గేట్స్, అజీమ్ ప్రేమ్‌జీ, ఒమిడ్యార్, రాక్‌ఫెల్లర్ నిధులు సమకూరుస్తున్న భారత వ్యతిరేక ఎన్జిఓ. ఆస్ట్రేలియాలో అదానీ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా 2017లో ది వైర్ వరుసగా కథనాలు కూడా రాసింది.
 
ఇలా ఉండగా, ఈ మొత్తం బృందం ఇప్పుడు అదానీ కంపెనీలపై చేపట్టిన దాడులు కేవలం ఒక సాకు మాత్రమే అని, అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ అని ఈ సందర్భంగా పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ  వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం స్పష్టం చేస్తుంది.
 
భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిని చూసి అసూయపడే అజీమ్ ప్రేమ్‌జీ, విదేశీ వ్యాపారవేత్త సోరెస్ లు బాగా ఎదుగుతున్న భారత వ్యాపారవేత్తలు అంబానీ, మిట్టల్, జిందాల్ లు లక్ష్యంగా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించడమే అని కూడా స్పష్టం చేస్తున్నారు.