
బెంగళూరుకు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ అవార్డ్ లభించింది. ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డ్ కోసం ప్రపంచ నలుమూలల నుంచి వందలమంది మ్యూజిక్ కంపోజర్స్ నామినేట్ అవుతారు. అందులో బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో రిక్కీ ఈ అవార్డు గెలుచుకున్నాడు.
ఈ ఆల్బమ్ లో 9 పాటలు, 8 మ్యూజిక్ వీడియోలు ఉన్నాయి. దీంతో గ్రామీ అవార్డును మూడుసార్లు గెలుచుకున్న తొలి ఇండియన్‌గా కేజ్ రికార్డును కైవసం చేసుకున్నారు. మన దేశం తరుపున గ్రామీ అవార్డు గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా, 4వ భారతీయుడిగా విక్కీ రికార్డు నెలకొల్పాడు. రిక్కీకి 2015 విండ్స్ ఆఫ్ సంసార, 2022 వచ్చిన వందే భారతమ్ ఆల్బమ్స్ కి గ్రామీ అవార్డ్స్ వచ్చాయి.
ఈ 65వ గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవాలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్నాయి. బ్రిటీష్ రాక్‌బ్యాండ్‌లో డ్రమ్ము వాయించే స్టీవార్ట్ కోప్‌ల్యాండ్‌తో కలిసి రిక్కీ అవార్డును సొంతం చేసుకున్నారు. అవార్డు గెలిచిన తర్వాత కేజ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మూడవసారి అవార్డు గెలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
More Stories
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు
మంగోలియన్ బాలుడిని 3వ అత్యున్నత నేతగా పేర్కొన్న దలైలామా
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్