బాల్య వివాహాలపై అస్సాం ఉక్కుపాదం… 1800 మంది అరెస్ట్

రాష్ట్రంలో బాల్య వివాహాలను  అడ్డుకునేందుకు కఠిన చర్యలు ప్రారంభించామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బాల్య వివాహాలను  అడ్డుకునే దిశగా దాదాపు 4 వేల కేసులను నమోదు చేశామని తెలిపారు. బాల్య వివాహాలు  చేస్తున్న, వాటిని ప్రోత్సహిస్తున్న సుమారు 1800 మందిని అస్సాంలో అరెస్ట్ చేశారు.
 
బాల్య వివాహ నిషేధ చట్టంను ఉల్లంఘించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు. బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. బాల్య వివాహ నేరాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. చిన్నారులపై కొనసాగుతున్న దారుణమైన నేరాలుగా బాల్య వివాహాలను పరిగణించాలని అస్సాం పోలీసులకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిశానిర్దేశం చేశారు.
 
బాల్య వివాహాలను అరికట్టే దిశగా అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్  కొనసాగుతుందని అస్సాం పోలీస్ ఐజీ ప్రశాంత కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు జరుగుతాయని స్పష్టం చేశారు. అస్సాం సీఎం శర్మ ఆదేశాల మేరకు గురువారం రాత్రి నుంచి రాష్ట్రంలో బాల్య వివాహాలపై పోలీసులు ఉక్కుపాదం  మోపుతున్నారు.
 
సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం రాత్రి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి, బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో వారికి దిశానిర్దేశం చేశారు. ఈ బాల్య వివాహమనే దుస్సాంప్రదాయాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించాలని వారికి సూచించారు.
మహిళలపై క్షమించరాని, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని, బాల్య వివాహాల మహిళలపై క్షమించరాని, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని, బాల్య వివాహాల కేసుల నిందితుల పట్ల ఎలాంటి సహనం వహించవద్దని పోలీసులను ఆదేశించినట్లు ట్వీట్‌ చేశారు.
 
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 లో అస్సాంలో జరుగుతున్న బాల్య వివాహాలపై సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 20 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతుల్లో 31.8% మందికి 18 ఏళ్ల లోపే వివాహమైందని ఆ సర్వే లో తేలింది. జాతీయ స్థాయిలో ఈ సగటు 23.3% కావడం గమనార్హం. కాగా, 14 ఏళ్లలోపు 
 
కాగా, 14 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న పురుషులపై పోక్సో చట్టం కింద, 14 నుంచి 18 ఏళ్లలోపు యువతులను వివాహం చేసుకున్న పురుషులపై బాల్య వివాహ నిషేధ చట్టం 2006 కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అస్సాం మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది.