కాంగ్రెస్ కన్నా ముందే స్వాతంత్య్రం లక్ష్యాన్ని ఎంచుకున్న ఆర్ఎస్ఎస్

డా. శ్రీరంగ్ గాడ్‌బోలే
 
(నిన్నటి వ్యాసంకు కొనసాగింపు)
 
అనేక సంవత్సరాల విజ్ఞప్తులు, అభ్యర్ధనలు, డొమినియన్ హోదా ఆలోచనలతో గడిపిన తరువాత, భారత జాతీయ కాంగ్రెస్ చివరకు డిసెంబర్ 1929లో లాహోర్ సెషన్‌లో సంపూర్ణ స్వాతంత్ర్య ఆలోచనకు వచ్చింది. కాంగ్రెస్ జనవరి 26, 1930ని సంపూర్ణ  స్వరాజ్ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని సమర్థించిన దేశభక్తులందరికీ ఈ వార్త హృదయపూర్వకంగా ఉంది. అటువంటి దేశభక్తుడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఇకపై సంఘ్) స్థాపకుడు డా. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్.
 
జనవరి 26తో సంఘ్ మొదటి ప్రయత్నం
 
ప్రజా జీవనంలో మొదటి నుండి హెడ్గేవార్ సంపూర్ణ స్వాతంత్ర్యంకు బలమైన ఛాంపియన్. విప్లవాత్మక మార్గంలో నడిచి, హిందూ మహాసభ, కాంగ్రెస్ లలో  పనిచేసిన తరువాత, ఆయన హిందూ ఏకీకరణ మాధ్యమం ద్వారా దేశ నిర్మాణాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 1925లో సంఘ్‌ను స్థాపించారు.
 
కాంగ్రెస్ చివరకు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తన లక్ష్యంగా స్వీకరించినప్పుడు ఆ ఆనందోత్సవాలలో పాలుపంచుకున్నారు. సంఘ్ స్వయంసేవకులు తమ వ్యక్తిగత సామర్థ్యంతో, సంస్థాగత అహంకారానికి దూరంగా ఏదైనా జాతీయ కార్యాచరణలో పాల్గొనాలని హెడ్గేవార్ నమ్మకం. ఆయన సంఘ్‌ను హిందూ సమాజపు సంస్థగా భావించారు. ఈ నమ్మకం ఆయన ఏ జాతీయ కార్యకలాపంలో సంస్థాగతంగా సంఘ్‌ ప్రవేశించకుండా నిరోధించింది.
 
కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానం పట్ల ఎంతగానో సంతోషించిన ఆయన ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. మరాఠీలో  21 జనవరి 1930 తేదీతో సంఘ స్వయంసేవకులందరికీ రాసిన లేఖలో హెడ్గేవార్ ఇలా పేర్కొన్నారు:
“ఈ సంవత్సరం కాంగ్రెస్ ‘స్వాతంత్ర్యం’ లక్ష్యంగా నిర్ణయించుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జనవరి 26న  హిందుస్థాన్ అంతటా ‘స్వాతంత్ర్య దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రకటించింది. అఖిల భారతీయ జాతీయ కాంగ్రెస్ మన స్వాతంత్య్ర లక్ష్యాన్ని చేరుకుందని మనం ఆనందించడం సహజమే. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే ఏ సంస్థకైనా సహకరించడం మన కర్తవ్యం. కాబట్టి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లోని అన్ని శాఖలు తమ స్వయంసేవకులందరి సమావేశాన్ని సాయంత్రం ఆరు గంటలకు వారి వారి తమ తమ సంఘస్థానాలలో ఏర్పాటు చేసి, జాతీయ జెండాకు, తర్వాత భగవా జెండాకు వందనం చేయాలి. స్వాతంత్ర్యం అర్థం, దీనిని మన లక్ష్యంగా ఎలా ఉంచుకోవాలనేది హింద్‌లోని ప్రతి నివాసి కర్తవ్యం అని ఒక ఉపన్యాసం ద్వారా వివరించవచ్చు. స్వాతంత్ర్య లక్ష్యానికి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను అభినందించడం ద్వారా కార్యక్రమాన్ని ముగించవచ్చు” (సంఘ్ ఆర్కైవ్స్, హెడ్గేవార్ పేపర్స్, ఎ. స్వయంసేవక్‌కి డాక్టర్ హెడ్గేవార్ రచించిన పత్రక్ – 21 జనవరి 1930).
 
ఎప్పుడూ పద్దతిగా ఉండే హెడ్గేవార్ అటువంటి కార్యక్రమాల నివేదికలను తక్షణమే తనకు పంపించాలని కోరుతూ ఫుట్-నోట్ జోడించారు. సంఘ్ ఆర్కైవ్‌లలో నిర్వహించే రిజిస్టర్‌లలో ఇటువంటి కార్యక్రమాల నివేదికలు ఉన్నాయి! మధ్య ప్రావిన్సులలోని మరాఠీ మాట్లాడే జిల్లాలైన నాగ్‌పూర్, వార్ధా, చందా (ప్రస్తుత చంద్రపూర్), భండారాలలో ఆనాటి సంఘ్ ఎక్కువగా ఉనికిలో ఉందని పేర్కొనవచ్చు. అమరావతి, బుల్దానా, అకోలా, యావత్మాల్‌లోని బెరార్ జిల్లాలలో ఇది చాలా తక్కువ ఉనికిని కలిగి ఉంది.
 
 హెడ్గేవార్ ఆదేశానుసారం, వివిధ ప్రదేశాలలో సంఘ్ శాఖలు ‘స్వాతంత్ర్య దినోత్సవం’ సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించాయి. కాంగ్రెస్‌కు అభినందనలు తెలుపుతూ తీర్మానాలను ఆమోదించాయి. నాగ్‌పూర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం 1930 జనవరి 26న ఉదయం 6 నుండి 7.30 వరకు సంఘస్థాన్‌లో న్యాయవాది విశ్వనాథ్ వినాయక్ కేల్కర్ అధ్యక్షతన జరగగా నారాయణ్ వైద్య ప్రధాన ప్రసంగం చేశారు. హాజరైన ప్రముఖులలో  హెడ్గేవార్, లక్ష్మణ్ వాసుదేయో పరంజ్పే (తర్వాత 1930లో హెడ్గేవార్ జైలుకు వెళ్లినప్పుడు తాత్కాలిక సర్సంఘచాలక్ అయ్యారు), నవతే, భండార సంఘచాలక్ న్యాయవాది  డియో, సకోలి సంఘచాలక్ పాఠక్, సావోనేర్ సంఘచాలక్ అంబోకర్ ఉన్నారు.
 

చండాలో జరిగిన కార్యక్రమం

చందాలో సంఘ్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు సంబంధించిన 29 జనవరి 1930న చందా సంఘం కార్యదర్శి రామచంద్ర రాజేశ్వర్ అలియాస్ తాత్యాజీ దేశ్‌ముఖ్ ఈ క్రింది నివేదికను హెడ్గేవార్‌కు పంపారు: “ఇక్కడి శాఖ 26.1.30న ఆకస్మికంగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయించింది. ఆ తర్వాత మీ ఉత్తరం వచ్చింది. దీని ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రింది కార్యక్రమం జరిగింది.
 
1) కాంగ్రెస్ కార్యదర్శి అభ్యర్థన మేరకు, సంఘ్ ఊరేగింపు ఉదయం 8.45 గంటలకు గాంధీ చౌక్ నుండి సైనిక క్రమశిక్షణలో ప్రారంభమైంది.   త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత స్వయంసేవకులు సైనిక వందనం సమర్పించారు. ఊరేగింపు తిరిగి సంఘస్థాన్‌కు చేరుకున్న తర్వాత, భగవా జెండాకు సైనిక వందనం సమర్పించారు. అనంతరం ఉదయం కార్యక్రమం ముగిసింది.
 
2) సాయంత్రం కాంగ్రెస్ ఊరేగింపులో పాల్గొనాలని, తీర్మానం ఆమోదించబడినప్పుడు కాంగ్రెస్‌తో కలిసి ఉండాలని సంఘ్‌ను అభ్యర్థించారు. అయితే, సంఘస్థాన్‌లో సంఘ కార్యక్రమం ముందుగా నిర్ణయించినందున, సంఘం కార్యదర్శి తాలూకా కాంగ్రెస్ కార్యదర్శికి సంఘ్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి నిస్సహాయతను తెలియజేశారు.
 
3) సంఘ్ కొనుగోలు చేసిన స్థలంలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైంది. కేశవరావు బోడకే ఆయుధాలు, కర్రలు, మిలటరీ డ్రిల్ ప్రదర్శన ఇచ్చారు. అప్పుడు (సంఘ్) చాలక్ ఆదేశాల మేరకు, న్యాయవాది భగవత్  ఆదేశం మేరకు   దేశ్‌ముఖ్ (కార్యదర్శి) తీర్మానాన్ని బలపరుస్తూ సంక్షిప్తాగా ప్రసంగించారు. భగవత్ తీర్మానాన్ని బలపరుస్తూ చిన్న ప్రసంగం చేశారు. యువతలో క్రమశిక్షణ, పద్దతి, నిబద్ధత పూర్తిగా అలవడితేనే స్వాతంత్య్రానికి మద్దతివ్వడం సమంజసమని, అందుకు తగ్గట్టుగానే వారు వ్యవహరించే సామర్థ్యాన్ని పెంచుకుంటేనే స్వాతంత్య్రానికి మద్దతివ్వడం సమంజసమని, సంఘ్ నిజానికి ఇంతకు ముందు నుంచే సంసిద్ధతతో ఉందని ఉద్ఘాటించారు.
 
తీర్మానాన్ని ప్రతిపాదిస్తునప్పుడు, అభ్యర్ధనలు, పిటిషన్, డొమినియన్ హోదా నుండి స్వాతంత్ర్య లక్ష్యాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా చేరుకుందో దేశ్‌ముఖ్ వివరించారు. ఈ ఆలోచన కాంగ్రెస్‌లో పుట్టకముందే సంఘ్ ‘స్వాతంత్ర్యం’ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ఆ కాంగ్రెస్ తీర్మానంలో సంఘ్‌కి కొత్తదనం కనిపించదు. ఏది ఏమైనప్పటికీ, ఈ జాతీయ సంస్థ సంఘ్ లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల సంఘ్ సహజంగానే సంతోషిస్తున్నది. అందుకే సంఘ్ జాతీయ కాంగ్రెస్‌ను సానుభూతితో అభినందిస్తోంది.
 
సాయంత్రం 6 గంటలకు సంఘ ప్రార్థన అనంతరం కార్యక్రమం ముగిసింది. మొత్తం 110 మంది స్వయంసేవకులు హాజరయ్యారు. తీర్మానం ఈ విధంగా చదివారు: “సంఘ్ లక్ష్యాలు, క్రమశిక్షణ పరిధిలో సాధ్యమైతే, స్వాతంత్ర్య లక్ష్యాన్ని చేరుకున్నందుకు, కాంగ్రెస్‌తో సహకరించాలని కోరుకుంటున్నందుకు జాతీయ కాంగ్రెస్‌ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హృదయపూర్వకంగా అభినందిస్తుంది.” నివేదికలో పేర్కొన్న న్యాయవాది భగవత్  ప్రస్తుత సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తాతగారు. అయిన నారాయణ్ పాండురంగ్ అలియాస్ నానాసాహెబ్ భగవత్!
 
26 జనవరి ఉత్సవాలకు సంఘ్ దూరంగా ఉందని ఆరోపిస్తున్నవారు పూర్తిగా తప్పుడు విమర్శలు చేస్తున్నవారుగానే పరిగణించాలి. స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం అనే దానితో సంబంధం లేకుండా జనవరి 26తో సంఘ్ సుదీర్ఘ ప్రయత్నం చేసింది.
 
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, సమకాలీన బౌద్ధ-ముస్లిం సంబంధాలు మరియు మతపరమైన జనాభా గురించి పుస్తకాలు రాశారు. అతను డాక్టర్. హెడ్గేవార్ మరియు బాలాసాహెబ్ దేవరాస్‌పై సంపుటాలను సవరించారు మరియు సంఘ్ చరిత్రను పరిశోధించారు)