ములాయం సింగ్ యాదవ్, ఎస్ ఎం కృష్ణలకు పద్మ విభూషణ్

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మా అవార్డులను ప్రకటించింది. వారిలో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.  భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన వారిలో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కర్నాటకకు చెందిన ఎస్ ఎం కృష్ణ, జాకిర్ హుస్సేన్, బాలకృష్ణ దోషి, శ్రీనివాస వరధాన్ తదితరులున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం 9 మందికి ప్రముఖులకు పద్మ భూషణ్ ప్రకటించింది.

పద్మ భూషణ్ పొందిన వారిలో కర్నాటకు చెందిన బైరప్ప, బిజినెస్ మ్యాన్ కుమార మంగళం బిర్లా, తమిళనాడు నుంచి వాణి జయరాం, తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో స్వామి చిన జీయర్ స్వామి, మహారాష్ట్ర నుంచి సుమన్ కళ్యాణపుర్, కర్నాటక నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి, తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో కమలేశ్ డీ పటేల్ తదితరులున్నారు.

వీరు కాకుండా, మరో 91 మందికి పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన 87 ఏళ్ల డాక్టర్ దిలీప్ మహాలనబీస్ కు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్  పురస్కారాన్ని ప్రకటించారు. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఓఆర్ ఎస్  కు ప్రాచుర్యం కల్పించి, లక్షలాది ప్రాణాలను ఆయన కాపాడారు. అమెరికా నుంచి వచ్చి, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో శరణార్ధుల శిబిరాల్లో ఓఆర్ఎస్ విధానంలో సేవలను అందించి వేలాది మందిని కాపాడారు.

ఈ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల ప్రాణాలు రక్షించబడ్డాయి. నోటి ద్వారా ఔషధాలను, ఇతర ముఖ్యమైన న్యూట్రియెంట్లను పంపించే ఈ విధానంతో భారత్ లో కలరా, డయేరియా, డీ హైడ్రేషన్ తదితర వ్యాధుల నుంచి లక్షలాది శిశువులు, పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు.

పద్మ విభూషణ్ గ్రహీతలు
వీరితో పాటుగా ఓఆర్‌ఎస్( ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త దిలీప్ మహాలనబిస్‌కు వైద్య రంగంలో మరణానంతరం విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది అక్టోబర్‌లో కన్ను మూశారు. ప్రముఖ తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుపేన్(కళలు),కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ (ప్రజా జీవితం), ప్రముఖ ఆర్కిటెక్చర్ బాలకృష్ణ దోషి(మరణానంతరం), అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీనివాస వర్ధన్ (సైన్స్, టెక్నాలజీ),ఇటీవల కన్ను మూసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (ప్రజాజీవితం)లకు పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి,
పద్మభూషణ్ పురస్కారాలు
ఎస్‌ఎల్ బైరప్ప(విద్య, సాహిత్యం), కుమార మంగళం బిరా ్ల(వాణిజ్యం, పరిశ్రమలు),దీపక్ ధార్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం(కళలు), సుమన్ కళ్యాణ్‌పుర్(కళలు),కపిల్ కపూర్( సాహిత్యం, విద్య), ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి (సామాజిక సేవ)లకు పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.
ఇక వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 91 మందికి పద్మశ్రీ పురసారాలు లభించాయి. వీరిలో సామాజిక సేవా రంగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన చందర్ దావర్, అండమాన్ నికోబార్‌కు చెందిన రతన్ చంద్రాకర్, గుజరాత్‌కుచెందిన గిరిజన సామాజిక సేవకురాలు హీరాబాయి లోబి,తమిళనాడుకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్స్ వడివేల్‌గోపాల్, మసి సదాయ్యన్, కళా రంగంలో కర్నాటకకు చెందిన రాణి మచ్చయ్య,ముని వెంకటప్ప తదితరులు ఉన్నారు.