నేతాజీ ఆధునిక చిరంజీవి … దత్తాత్రేయ హోసబలే

నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత దేశ చరిత్రలో `ఆధునిక చిరంజీవి’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హసబలే అభివర్ణించారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా మణిపాల్ లోని జిపి మహిళా కళాశాలలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రాచీన భారత చరిత్రలోని వ్యాస, పరుశురాం, హనుమాన్ వంటి వారని తెలిపారు.
 
ఈశాన్య ప్రాంత మేధావుల వేదిక (ఐ ఎఫ్ ఎన్ ఇ) ఆధ్వర్యంలో “నేతాజీ. ఆజాద్ హింద్ ఫౌజ్, స్వతంత్ర సంగ్రామం” అంశంపై జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అద్భుతమైన స్ఫూర్తి కలిగించే విధంగా ఈ మహానాయకుడి జన్మదినాన్ని భారత ప్రభుత్వం `పరాక్రమ్ దివాస్’గా ప్రకటించిందని ఆయన కొనియాడారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బలహీనంగా ఉన్న `శత్రువు బ్రిటిష్’ను దెబ్బతీయాలని, దేశం నుండి తప్పించుకొని జర్మనీ, రష్యాల సహకారం తీసుకొన్నారని చెబుతూ అయితే నేతాజీ ఫాసిస్ట్ గాని, కమ్యూనిస్ట్ గాని కాదని, కేవలం నేషనలిస్ట్ మాత్రమే అని దత్తాత్రేయ తేల్చి చెప్పారు. భారత దేశం గురించి చులకనగా వ్రాసిన హిట్లర్ నే ప్రశ్నించిన అసామాన్యమైన సాహసం ప్రదర్శించారని తెలిపారు.
మణిపాల్ డీమ్డ్ యూనివర్సిటీలో వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి టి ఎ పాయ్ కొంతకాలం క్రింతం `ఆపరేషన్ లీడర్ షిప్ డెవలప్మెంట్’ ప్రాజెక్ట్ లో భాగంగా “యువతకు స్ఫూర్తి కలిగించే వారు ఎవ్వరు?” అనే ప్రశ్న అడిగారని, సాధారణంగా ఎవ్వరో ఒక సినీ తార పేరు చెబుతారని అనుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా స్వామి వివేకానంద, నేతాజీ పేర్లు చెప్పారని చెప్పారు.
 
చాలామంది తమ పిల్లలకు రాముడు, కృష్ణుడు, శివాజీ లతో పాటు నేతాజీ పేర్లు పెట్టుకొంటుంటారని పేర్కొంటూ మహనీయుల పేర్లను ఆ విధంగా స్మరించుకోవడం ఈ జాతి స్వభావం అని దత్తాత్రేయ తెలిపారు. గౌతమ్ బుద్ధ సత్యం, పరమ విజ్ఞానం గుర్తించి తెలుసుకోవడం కోసం సర్వం త్యాగం చేశారని గుర్తు చేస్తూ, సంహాసనంకు కట్టుబడి ఉంటె ఆయన పేరును నేడు ఎవ్వరు గుర్తుంచుకొనేవారు కాదని చెప్పారు.
 
తనకాలంలో అత్యంత గొప్పదైన ఐసిఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత రాజీనామా చేస్తూ నేతాజీ తన సోదరుడికి వరుసైన లేఖలో తనకు స్వామి వివేకానంద మార్గదర్శి అని పేర్కొన్నారని, రాజీనామా లేఖలో “ఒక భారతీయునిగా ఇసిఎస్ నా జీవితంలో ముఖ్యమైన కార్యంగా భావించడం లేదు” అని స్పష్టం చేసారని వివరించారు.
 
భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులను మార్చ్ 23, 1931న బ్రిటిష్ పాలకులు ఉరితీసిన సమయంలో బ్రిటిష్ పాలనను సవాల్ చేస్తానని నేతాజీ ప్రతిజ్ఞ తీసుకున్నారని దత్తాత్రేయ గుర్తు చేశారు. మొత్తం ప్రపంచంలో భారత విప్లవ ఉద్యమం వినుత్నమైనదని చెబుతూ విప్లవ పోరాటాలను దేశభక్తి చర్యగా మొత్తం ప్రపంచం గుర్తించిందని ఆయన తెలిపారు.
 
ఫడ్కే, రాజ్ గురు వంటి అనేకమంది విప్లవకారులు ఆత్యతికత గలవారిని దుర్గాదాస్ గ్రంధం తెలుపుతుందని వివరించారు. భగత్ సింగ్ ఆర్యసమాజ్ తో సంబంధం ఏర్పర్చుకున్నారని, స్వామి వివేకానంద, నివేదిత వంటి వారు విప్లవకారులకు స్ఫూర్తి కలిగించారని చెప్పారు. విప్లవకారులుగా జీవితం ప్రారంభించిన వీర్ సావర్కర్, అరవిందో సహితం గొప్ప ఆధ్యాత్మికవేత్తలని తెలిపారు.
భారత స్వతంత్ర ఉద్యమాన్ని ఆధ్యాత్మికత ప్రభావితం చేసిందని చెబుతూ, అందుకు నేతాజీ సహితం భిన్నంకాదని స్పష్టం చేశారు. నేతాజీ ఎంతో దూరదృష్టి గల నేతని, భవిష్యత్ భారతదేశ అభివృధ్ధికోసం ఆలోచిన్చేవారని పేర్కొంటూ కాంగ్రెస్ అద్యక్షకునిగా ఆర్ధిక అంశాలపై నెహ్రు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పారు చేశారని, అదే విధంగా, శాస్త్ర, సాంకేతిక అంశాలపై మోక్షగుండం విశ్వేస్వరయ్య అధ్యక్షతన మరో కమిటీ ఏర్పర్చారని గుర్తు చేశారు.
 
1939లో త్రిపుర కాంగ్రెస్ లో గాంధీజీ బలపరచిన పట్టాభి సీతారామయ్యను ఓడించి అధ్యక్షునిగా గెలుపొందిన, పైవారి ఒత్తిడిల కారణంగా రాజీనామా చేసి, సొంతంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థించుకున్నారని పేర్కొంటూ అయితే అందుకు ఎవ్వరిని నిందించలేదని స్పష్టం చేశారు.