తనను గవర్నర్ పదవి నుంచి తప్పించమని ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అభ్యర్థించారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. మిగిలిన జీవితాన్ని చదవడానికి, రాయడానికి, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుకుంటున్నానని గవర్నర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి నేను సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. సాధువులు, సంఘ సంస్కర్తలు, వీర యోధులు నడియాడిన నేల ఇది అని గవర్నర్ పేర్కొన్నారు. ‘నేను శేష జీవితాన్ని గ్రంథపఠనం, రచనల్లో కొనసాగించాలనుకుంటున్నాను. గొప్ప రాష్ట్రమైన మహారాష్ట్రకు రాజ్య సేవక్ లేక రాజ్యపాల్‌గా సేవలందించడం గర్వకారణంగా ఉంది. మహారాష్ట్ర సాధువులు, సామాజిక సంస్కర్తలు, యోధులకు నెలవైన రాష్ట్రం’ అని కోష్యారీ వివరించారు.
కాగా, ఇటీవల మోదీ మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో తన కోరికను ఆయనకు చెప్పానని కోశ్యారి తెలిపారు. ‘గత మూడేళ్లలో మహారాష్ట్ర ప్రజల నుంచి నాకు లభించిన ఆదరాభిమానాలు మరచిపోలేనివి. ఇటీవల ప్రధాని మోదీ ముంబై వచ్చినప్పుడు కూడా నేను రాజకీయ జీవితం నుంచి విరమించుకుని నా శేష జీవితాన్ని పుస్తక పఠనం, రచనలో గడుపాలనుకుంటున్నాను’ అని గవర్నర్ ప్రకటించారు.
పదవి నుంచి తప్పించాలని కోరుకున్నట్లు మోదీ కి తెలియజేసినట్లు కోశ్యారి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నుంచి తాను ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలు పొందుతున్నానని పేర్కొంటూ ఆ మాదిరిగానే మోదీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
More Stories
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు