ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ల ఘోర విమాన ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్ కిండర్‌గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ హోం మంత్రి సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. హోం శాఖ మంత్రి డేనిస్ మోనాస్థిరిస్కీ సహా ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జనావాసాల మధ్య హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు.
ప్రమాద సమయంలో అరుపులు, కేకలు వినిపించాయి. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో ఇంకా తెలియరాలేదు. బ్రోవర్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. దాంట్లో పది మంది చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. బ్రోవరీ పట్టణంలో ఉన్న కేజీ స్కూల్ వద్ద ఈ ఘటన జరిగింది. కీవ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పట్టణంలో లక్షా పది వేల మంది జనాభా ఉన్నారు. హోంశాఖ మంత్రి మోనస్ట్రిస్కీతో పాటు డిప్యూటీ మంత్రి ఎవ్‌జనీ యెనిన్, ఆ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న బిల్డింగులకు మంటులు అంటుకోన్నాయి. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. మృతులు, బాధితుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈశాన్య కీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బ్రోవరీ టౌన్ ఉంది. బ్రోవరీ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఇటీవల రష్యా బలగాలు ప్రయత్నించగా, ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటించాయి
More Stories
పెళ్లి కాని ప్రతి మహిళా బజారు సరుకు!
ప్రతీకార దాడులు తప్పువని ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక
ఫిజిక్స్‌లో ఇద్దరికి నోబెల్ పురస్కారం