నలుగురి చేతులను బహిరంగంగా నరికిన తాలిబన్లు

అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా తాలిబన్లు మాత్రం క్రూరత్వాన్ని కొనసాగిస్తున్నారు. నిందితులకు బహిరంగంగా శిక్షణలను అమలు చేస్తూనే ఉన్నారు. వీటిలో కొన్ని మాత్రమే బయటికి ప్రపంచానికి తెలుస్తున్నాయని, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు కూడా ఇప్పటి ఈ బహిరంగ క్రూరమైన శిక్షలను ఆపాలని తాలిబన్‍లకు సూచనలు చేశారు.
అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా, కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ఆఫ్ఘాన్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్‌ నాయకులు  కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆఫ్ఘాన్‌ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. షరియా చట్టం ద్వారా ప్రజల్ని తీవ్రంగా హింసిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 7న ఫరా ప్రావిన్స్ లో ఓ వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా ఉరితీశారు. 2021 ఆగస్టులో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లు బహిరంగ ఉరి అమలు చేయడం ఇదే తొలిసారి. పూర్తిస్థాయి విచారణ లేకుండానే నిందితులుగా అనుమానించిన వారిని శిక్షిస్తున్నారని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నా తాలిబన్లు వెనక్కి తగ్గడం లేదు.
 
తాజాగా, దొంగతనం చేశారన్న ఆరోపణలతో నలుగురి చేతులను బహిరంగంగా నరికేశారు. కాందహార్‌లోని అహ్మద్‌షాహి స్టేడియంలో వందలాది మంది చూస్తుండగానే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడ్డారు. స్టేడియంలో తాలిబన్లు నలుగురి చేతులను నరికివేశారని అఫ్గాన్ రీసెటిల్‍మెంట్ మంత్రిత్వ శాఖ మాజీ పాలసీ అడ్వయిజర్ షబ్నం నసిమి వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
అదేవిధంగా, దొంగతనం, బహిరంగ శృంగారం చేశారనే ఆరోపణలతో తొమ్మిది మందిని తాలిబన్‍లు అదుపులోకి తీసుకున్నారు. వారిని కాందహార్‌లోని అహ్మద్ షాహీ స్టేడియంలో బహిరంగంగా కొరడాలతో కొట్టారు. “దొంగతనం, సొడొమి (సెక్స్) ఆరోపణలపై కాందహార్‌లోని అహ్మద్ షాహీ స్టేడియంలో 9 మందికి శిక్ష పడిందని సుప్రీంకోర్టు ప్రకటన పేర్కొంది” అని టోలో న్యూస్ ట్వీట్ చేసింది.
నిందితులను కొరడాలతో శిక్ష విధించే కార్యక్రమానికి అక్కడి స్థానిక అధికారులు, ప్రజలు హాజరయ్యారు. నిందితులను 35 నుంచి 39 సార్లు తాలిబన్లు కొరడాలతో కొట్టారని ఆ ప్రావెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి హజి జయీద్ వెల్లడించారు.ద్దేశం. నేరాలు చేయాలంటేనే భయపడేలా ప్రజలు బహిరంగంగా ఉరితీయడం, కాళ్లు, చేతులు విరగ్గొట్టడం, కొరడా దెబ్బలు కొట్టడం వంటివి ఈ చట్టం కిందకు వస్తాయి.
ఆఫ్ఘాన్‌ను కైవసం చేసుకున్న తర్వాత తాలిబన్లు ఇలాంటి శిక్షలనే అమలు చేస్తున్నారు. 1990లోనూ తాలిబన్లు ఇలాంటి శిక్షలే విధించేవారు.  న్యాయస్థానంలో శిక్ష పడిన వారిని బహిరంగంగా ఉరితీసేవారు. కొరడాతో కొట్టి శిక్షించడం, రాళ్లతో కొట్టి చంపేవారు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి శిక్షలు విధిస్తుండడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు.