నేపాల్‌ విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం

నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిన ఘటనలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం సమయంలో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
 
ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసికందులు సహా 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్‌లు, ఇద్దరు కొరియన్‌లు, ఇద్దరు ఐర్లాండ్‌కు చెందినవారు, ఆఫ్ఘనిస్థాన్‌, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
 
ప్రమాదం జరిగిన వెంటనే పొఖారో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్‌ రెస్క్యూ టీమ్స్‌ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 30 మంది మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన కారణంగా పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.
పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలిపోవడానికి ముందు తన దిశను కోల్పోయినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. కుప్పకూలిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు ఆ విమానం తలక్రిందులవుతున్నట్లుగా ఒరిగిపోవడం కనిపించింది. ఈ విమానాశ్రయానికి సమీపంలోని ఓ భవనంపై నుంచి ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు, 10 మంది ఇతర దేశస్థులు ఉన్నారు. ఈ విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 10.33 గంటలకు బయల్దేరింది. ఈ విమానం ఖాట్మండు నుంచి పోఖారా వెళ్తోంది. సేతి గండకి నది పరీవాహక ప్రాంతంలోని అటవీ ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నది పాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు, పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యలో ప్రవహిస్తోంది.

ఈ విమానంలో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒకరు ఐరిష్, ఇద్దరు కొరియన్లు, అర్జంటైనా జాతీయుడొకరు, ఫ్రెంచ్ జాతీయుడొకరు ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే విమానం నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.