ప్రవాసి భారతీయులు భారత్ కు జాతీయ దూతలు

ప్రవాసి భారతీయులలో ప్రతి ఒక్కరు భారతదేశానికి చెందిన జాతీయ దూతలు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఏర్పాటైన 17వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ వారి తోడ్పాటును ప్రపంచం గణించే సంద్భాలలో వారు ఒక శక్తివంతమైన, సమర్ధత కలిగిన భారతదేశంపు  వాణిని మారుమోగింప చేస్తున్నట్లే అవుతుందని చెప్పారు. 

‘‘మీరు భారతదేశపు  ‘మేక్ ఇన్ ఇండియా’, యోగ, ఆయుర్వేద, భారతదేశ కుటీర పరిశ్రమలు, హస్తకళ ల  జాతీయ దూతలుగా ఉన్నారు’’ అని ఆయన తెలిపారు. ‘‘అదే కాలంలో మీరు భారతదేశపు చిరుధాన్యాలకు సైతం బ్రాండ్ అంబాసడర్ లు’’ అని ఆయన పేర్కొన్నారు. 

2023వ సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’గా ప్రకటించిన సంగతిని ప్రస్తావిస్తూ  ప్రతి ఒక్కరు వెనుదిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని చిరుధాన్యాల ఉత్పత్తుల తమ వెంట తీసుకు పోవాలంటూ ప్రధాని సూచించారు. 

భారతదేశాన్ని గురించి మరింతగా తెలుసుకోవాలి అని ప్రపంచ దేశాలలో ఉన్న అభిలాషను నెరవేర్చడంలో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర ను పోషించవలసి ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో భారతదేశానికేసి చూస్తున్నాయని చెబుతూ ఇటీవల కొన్నేళ్ళు గా దేశం అసాధారణమైనటువంటి కార్యసాధనలను సొంతం చేసుకొందని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా  ప్రధాన మంత్రి మేక్ ఇన్ ఇండియా వేక్సీన్ ను గురించి, రికార్డు సంఖ్య లో 220 కోట్ల కు పైగా ఉచిత టీకా దోషులను భారతీయులకు అందజేయడాన్ని గురించి ఉదాహరించారు. ప్రస్తుతం అస్థిరత కొనసాగుతున్న వేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకు ముఖచిత్రంలో భారతదేశం ప్రముఖ స్థానాన్ని దక్కించుకోవడాన్ని గురించి ప్రస్తావిస్తూ భారతదేశం ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిందని ప్రధాని గుర్తు చేశారు. 

భారతదేశంలో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ప్రవర్థమానం అవుతోందని, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా తనదైన గుర్తింపు ను తెచ్చుకొంటోందని తెలిపారు.  తేజస్ పోరాట విమానాలు, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, పరమాణు జలాంతర్గామి అరిహంత్ లను గురించి ఆయన ప్రస్తావించారు.

భారతదేశంలో నగదు చలామణి తక్కువగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గురించి, ఫిన్ టెక్ ను గురించి కూడా ప్రధాన మంత్రి చెప్తూ, ప్రపంచంలో వాస్తవ కాల ప్రాతిపదికన చోటు చేసుకొంటున్నటువంటి డిజిటల్ లావాదేవీలలో 40 శాతం లావాదేవీలు భారతదేశం లోనే జరుగుతున్నాయని మోదీ  వివరించారు. 

అంతరిక్ష సాంకేతిక విజ్ఞానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వందల కొద్దీ మానవ నిర్మిత ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినటువంటి అనేక రికార్డులను భారతదేశం నెలకొల్పుతోందని చెప్పారు.  భారతదేశంలో సాఫ్ట్ వేర్, డిజిటల్ టెక్నాలజీ పరిశ్రమలను గురించి పేర్కొంటూ  కాలంతో పాటే భారతదేశం సామర్థ్యం వృద్ధి చెందుతోందని తెలిపారు.

‘‘భారతదేశం ఇస్తున్నటువంటి సందేశానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాముఖ్యం ఉంది’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్  బలం భవిష్యత్తులో ఒక పెద్ద ఉత్తేజాన్ని అందుకోనుందని పేర్కొంటూ భారత్ సంస్కృతి, సంప్రదాయాలను గురించినటువంటి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడం ఒక్కటే కాకుండా దేశం సాధిస్తున్న ప్రగతిని గురించి సైతం అవగాహనను ఏర్పరచుకోవాలని  సమ్మేళనంలో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ని చేశారు.

జి20 అధ్యక్ష బాధ్యతలను ప్రస్తావిస్తూ  ‘‘జి-20 అనేది దౌత్యపరమైన కార్యక్రమం ఒక్కటే కాదు. దానిని సార్వత్రిక భాగస్వామ్యంతో కూడిన ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ క్రమంలో ఎవరైనా సరే ‘‘అతిథి దేవో భవ’’ అనేటటువంటి భావనను గురించి కూడాను అనుభూతి ని పొందవచ్చు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.