మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు

మరో వారం రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు దృష్టిలో పెట్టుకొని , కేంద్రం రైతుల కోసం ఎన్నో స్కిం లను తీసుకురాగా, వాటిలో పీఎం కిసాన్ స్కిం ఒకటి. ఇప్పటికే 12 సార్లు పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయగా..ఇప్పుడు మరోసారి రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. సంక్రాంతి కల్లా ఈ డబ్బులు జమ చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటి దాకా సర్కార్ 12 విడతల డబ్బులను ఇచ్చింది. ఇప్పుడు మరో రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు అందిస్తున్నారు. అంటే మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున ఈ డబ్బులు పొందొచ్చు. ఇదిలా ఉంటె దేశంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది.

ఇందులో దేశంలోని రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేయటానికి అవసరమైన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారని వినికిడి. రైతులకు అందుతున్న మెుత్తాన్ని పెంచాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నప్పటికీ దానిపై వాయిదాల పర్వం నడిచింది.

ఇప్పటి వరకు కేంద్రం రైతులకు ఏడాదికి పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6000 చెల్లిస్తోంది. అయితే ఈ మెుత్తాన్ని రూ.2000 పెంచి రూ.8000 కు చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే ఏడాదికి నాలుగు విడతలుగా ఈ మెుత్తాన్ని రూ.2000 చొప్పున చెల్లించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది అమలులోకి వస్తే ఏడాదికి మూడు సార్లకు బదులుగా నగదు నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లోకి వస్తుంది.