ఈ ఏడాది 73 కేసులు నమోదు చేసిన ఎన్‌ఐఏ

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2022 సంవత్సరంలో గరిష్ఠంగా 73 కేసులను నమోదు చేసింది. గతేడాది కంటే (2021) 19.67శాతం కేసులు ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్‌ఐఏను ప్రారంభించి తర్వాత ఇంత మొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వీటిలో జిహాదీ ఉగ్రవాదానికి సంబంధించినవి 35 కేసులుండగా, జమ్మూకశ్మీర్, అసోం, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌లలో జిహాదీ ఉగ్రవాద కేసులను ఎన్‌ఐఏ నమోదు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను విచారిస్తోంది.

ఈ సంవత్సరం ఎన్‌ఐఏ చేపట్టిన అతిపెద్ద కార్యకలాపాల్లో ఒకటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై దాడులు జరిపింది. సెప్టెంబరు నుంచి నిర్వహించిన మూడు వేర్వేరు దాడుల్లో ఎన్‌ఐఏ దాదాపు 200 చోట్ల దాడులు జరిపింది. పీఎఫ్‌ఐకి చెందిన 100 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. 

ముంబై 26/11 దాడుల తర్వాత 2009లో ఎన్‌ఐఏ ఏర్పాటైంది. 2019లో ప్రభుత్వం చట్టవ్యతిరేక నిరోధక (కార్యకలాపాలు) చట్టంలోని షెడ్యూల్ 6ను సవరించింది. ఈ సవరణతో ఎన్‌ఐఏ ఓ వ్యక్తికి ఉగ్రవాదిగా గుర్తించే అవకాశం ఉండగా, ఇంతకు ముందు సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనే అవకాశం ఉంది. 

ఆగస్ట్ 2022 నాటికి ఎన్‌ఐఏ నేరారోపణ రేటు 93.25 శాతంగా ఉంది. ఏ కేంద్ర ఏజెన్సీకి అయినా ఇదే అత్యధికం. ఏజెన్సీలో దాదాపు 3 వేల మంది వ్యక్తులను అరెస్టు చేయగా.. ఆగస్టు 2022 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 391 మంది దోషులుగా తేలారు.