ఈ ఏడాది కాశ్మీర్ లో 172 మంది ఉగ్రవాదుల హతం

క‌శ్మీర్ లోయ‌లో 2022లో 42 మంది విదేశీ ఉగ్ర‌వాదుల‌తోపాటు మొత్తం 172 మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టామ‌ని జ‌మ్ము క‌శ్మీర్ అద‌న‌పు డీజీపీ విజ‌య్‌కుమార్ పేర్కొన్నారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో యువ‌త చేరిక‌లు 37 శాతం త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని ట్వీట్ చేశారు. క‌శ్మీర్ లోయ‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల దాడుల‌పై శ‌నివారం ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు.

క‌శ్మీర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు 93 ఉగ్ర‌వాద వ్య‌తిరేక ఆప‌రేష‌న్స్ చేప‌ట్టాయ‌ని తెలిపారు. భ‌ద్ర‌తాద‌ళాల ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల్లో 108 మంది ల‌ష్క‌ర్‌-ఏ-తొయిబా, 35 మంది జైషే మ‌హ‌మ్మ‌ద్‌, 22 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్‌, న‌లుగురు ఆల్ బాద్ర్‌, ముగ్గురు అన్సార్ గ‌జ్వాత్ ఉల్ హింద్ ఉగ్ర‌వాదులు ఉన్నారు.  వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారని చెప్పారు. 

కశ్మీరు లోయలోని సమాజంలో ముఖ్యంగా రెండు మార్పులు కనిపించాయని తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇళ్ల యజమానులు నిరాకరించడం ప్రారంభించారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉగ్రవాద సంస్థల్లో చేరడాన్ని గర్వకారణంగా భావించడం మానేశారని చెప్పారు. 
 
మరోవంక, ఇప్పటికే ఉగ్రవాదంలో చేరినవారిని తిరిగి రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదులను బహిరంగంగానే దూషిస్తున్నారని చెప్పారు. తమ పిల్లలను తిరిగి రప్పించేందుకు జమ్మూ-కశ్మీరు పోలీసులతో కలిసి పని చేస్తున్నారని వివరించారు. 

భ‌ద్ర‌తాద‌ళాల ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల్లో 108 మంది ల‌ష్క‌ర్‌-ఏ-తొయిబా, 35 మంది జైషే మ‌హ‌మ్మ‌ద్‌, 22 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్‌, న‌లుగురు ఆల్ బాద్ర్‌, ముగ్గురు అన్సార్ గ‌జ్వాత్ ఉల్ హింద్ ఉగ్ర‌వాదులు ఉన్నారు. భ‌ద్ర‌తాద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పులు, ఉగ్ర‌వాద దాడుల్లో 14 మంది జ‌మ్ముక‌శ్మీర్ పోలీసుల‌తోపాటు 26 మంది భ‌ద్ర‌తా ద‌ళాల జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని విజ‌య్‌కుమార్ తెలిపారు. ఉగ్ర‌దాడుల్లో 29 మంది పౌరులు మృతి చెందార‌ని చెప్పారు.

భ‌ద్ర‌తాద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పులు, ఉగ్ర‌వాద దాడుల్లో 14 మంది జ‌మ్ముక‌శ్మీర్ పోలీసుల‌తోపాటు 26 మంది భ‌ద్ర‌తా ద‌ళాల జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని విజ‌య్‌కుమార్ తెలిపారు. ఉగ్ర‌దాడుల్లో 29 మంది పౌరులు మృతి చెందార‌ని పేర్కొన్నారు.

ఈ ఏడాది కొత్త‌గా 100 మంది ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో చేరార‌ని, గ‌తేడాదితో పోలిస్తే ఇది 37 శాతం త‌క్కువ చెప్పారు. వారిలో 74 మంది ల‌ష్క‌రే తొయిబాలో చేరార‌ని వెల్ల‌డించారు. కొత్త‌గా ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో చేరిన వారిలో 65 మంది ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌తం అయ్యార‌ని తెలిపారు.

17 మంది ఉగ్ర‌వాదులు అరెస్ట్ కాగా, 18 మంది కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్నార‌ని విజ‌య్ కుమార్ చెప్పారు. ఎన్‌కౌంట‌ర్ల‌లో మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల నుంచి 121 ఏకే సిరీస్ రైఫిళ్లతోపాటు ఎనిమిది ఎం4 కార్బైన్‌, 231 పిస్ట‌ళ్లతోపాటు మొత్తం 360 ఆయుధాలు జ‌ప్తు చేశామ‌ని పేర్కొన్నారు.

కాగా, కేంద్రపాలిత ప్రాంతంలో ‘జీరో టెర్రర్’ కార్యకలాపాలను సాధించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు సరైన దిశలో ముందుకెళ్తున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ తెలిపారు.  పాక్‌ ప్రేరేపిత 146 టెర్రర్‌ మాడ్యూల్స్‌, ఒక్కొక్కరు నలుగురి నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్టివ్ అండ్‌ టార్గెటెడ్ హత్యలు, గ్రెనేడ్, ఐఈడీ దాడులను పసిగట్టి అరికట్టామని పేర్కొన్నారు.