సామాజిక పురోగతి సూచికలో తెలుగు రాష్ట్రాలు వెనుకంజ 

సామాజిక పురోగతి సూచిక (ఎస్‌పిఐ)లో తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణ 26వ ర్యాంక్‌లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ 53.60 స్కోర్‌ సాధించగా, తెలంగాణ 52.11 స్కోర్‌ సాధించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక బేసిక్‌ అవసరాల్లో (59.30) సాధించింది. ప్రాథమిక బేసిక్‌ అవసరాల్లో పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణలో (46.42), తాగు నీరులో (61.13), పారిశుధ్యంలో (68.73), వ్యక్తిగత భద్రతలో (60.91) విభాగాల్లో సాధించింది. ఏపి ప్రజా శ్రేయస్సు పునాదుల్లో 46.52 స్కోర్‌ సాధించింది. 

ప్రజా శ్రేయస్సు పునాదులో ప్రాథమిక విజ్ఞాన సదుపాయం (49.18), ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ యాక్సెస్‌ (40.96), ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్‌ అండ్‌ వెలొస్‌) (39.17), పర్యావరణ నాణ్యత (56.75) సాధించింది. ఏపి అవకాశాల్లో 54.98 స్కోర్‌ సాధించింది. అందులో వ్యక్తిగత హక్కులు (52.25), వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక (62.47), సమగ్రత (52.93), అధునాతన విద్య (43.08 స్కోర్‌) నిలిచింది.

తెలంగాణ ప్రాథమిక బేసిక్‌ అవసరాల్లో (60.53) సాధించింది. ప్రాథమిక బేసిక్‌ అవసరాల్లో పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణలో (46.62), తాగు నీరులో (70.64), పారిశుధ్యంలో (82.64), వ్యక్తిగత భద్రతలో (42.22) విభాగాల్లో సాధించింది. తెలంగాణ ప్రజా శ్రేయస్సు పునాదుల్లో 45.04 స్కోర్‌ సాధించింది.

 ప్రజా శ్రేయస్సు పునాదులో ప్రాథమిక విజ్ఞాన సదుపాయం (48.79), ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ యాక్సెస్‌ (41.50), ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్‌ అండ్‌ వెలొస్‌) (44.29), పర్యావరణ నాణ్యత (45.56) సాధించింది. తెలంగాణ అవకాశాల్లో 50.75 స్కోర్‌ సాధించింది. అందులో వ్యక్తిగత హక్కులు (38.25), వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక (62.41), సమగ్రత (44.06), అధునాతన విద్య (58.28 స్కోర్‌) నిలిచింది.