
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. తెలుగు చిత్రసీమ తొలితరం నటులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. రెండు రోజుల క్రితం నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అనంతలోకాలకు చేరుకోగా, నేడు సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. చలపతిరావు.. 1944, మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు.
1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సహాయ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు. మహానటుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి వెండితెరపై ఒక వెలుగు వెలిగారు.
ఎన్నో విలక్షణమైన పాత్రల్లో ఆయన నటించారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. నిర్మాతగా 7 సినిమాలను చలపతిరావు నిర్మించారు. ఆయనను పరిశ్రమలో అంతా బాబాయ్ అంటూ ప్రేమగా పిలిస్తుంటారు. చలపతిరావు కుమారుడు రవిబాబు కూడా నటుడు, దర్శకుడుగా సిని పరిశ్రమలో ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.
More Stories
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ముప్పు
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం