దక్షిణ మధ్య రైల్వేకు ఇంధన పొదుపు అవార్డులు

దక్షిణ మధ్య రైల్వే ఇంధన పొదుపు చర్యలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంది .ఇందులో భాగంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందుతోంది. దక్షిణ మధ్య రైల్వే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఇంధన పరిరక్షణ అవార్డులను అందుకుంటుంది.
ఇందులో భాగంగా , తెలంగాణ ప్రభుత్వ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టి ఎస్ ఆర్ ఈ డి సి ఓ) అందిస్తున్న “తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2022” (టి ఎస్ ఈ సి అవార్డులు)లో దక్షిణ మధ్య రైల్వే నాలుగు అవార్డులను కైవసం చేసుకుంది.  ఈ అవార్డులను మంగళవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి ప్రదానం చేశారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ అందించిన “ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ – 2022” ( ఏ పి ఎస్ ఈ సి అవార్డులు)లో దక్షిణ మధ్య రైల్వే రెండు అవార్డులను పొందింది. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్  ప్రదానం చేశారు.
 
టి ఎస్ ఈ సి అవార్డుల వివరాలు:
• రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు గోల్డ్ అవార్డు
• రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సిల్వర్ అవార్డు 
• ప్రభుత్వ భవనాల కేటగిరీలో సంచలన్ భవన్ (సికింద్రాబాద్ డి ఆర్ ఎం కార్యాలయం) కి గోల్డ్ అవార్డు
• ప్రభుత్వ భవనాల విభాగంలో లేఖ భవన్ (ఎస్ సి ఆర్ అకౌంట్స్ ఆఫీస్ బిల్డింగ్)కి సిల్వర్ అవార్డు 
 
ఏ పి ఎస్ ఈ సి అవార్డులు: 
• ఆసుపత్రి భవనాల విభాగంలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆసుపత్రికి గోల్డ్ అవార్డు
• ఆఫీస్ బిల్డింగ్స్ కేటగిరీలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సెంటర్ కు సిల్వర్ అవార్డు. 
ఈ సందర్భంగా  ఈ ఇంధన పరిరక్షణ అవార్డుల సాధనలో తమ వంతు సహకారం అందించిన దక్షిణ మధ్య రైల్వే ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన అందరిని అలాగే , సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు ,ఇతర రైల్వే సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్  అభినందించారు.