కరోనా నిబంధనలు పాటించలేక పోతే జోడి యాత్ర ఆపేయండి రాహుల్

భారత్ జోడో యాత్రలో కచ్ఛితంగా కరోనానిబంధనలు పాటించడం లేదా పాదయాత్రను వాయిదా వేసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయా బుధవారం విజ్ఞప్తి చేశారు. పొరుగు దేశం చైనాలో చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి లేఖ రాశారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పసరిగా పాటించాలని, కేవలం టీకా తీసుకున్నవారినే యాత్రలో పాల్గొనేలా చూడాలని మన్‌సుఖ్ మాండవీయ కోరారు. ఒకవేళ, వీటిని అనుసరించడం సాధ్యం కాకపోతే జోడోయాత్రను వాయిదా వేసుకోవాలని అభ్యర్థించారు.
‘‘కరోనా నిబంధనలను పాటించడం సాధ్యం కాకపోతే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయండి..’’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  చైనాలో జీరో కోవిడ్ నిబంధనలను ఎత్తివేయడంతో వైరస్ వ్యాప్తి అసాధారణంగా ఉండడంతో పాటు  ఆస్పత్రులన్నీ నిండిపోయి.. పడకలు కూడా సరిపోని పరిస్థితి నెలకుంది. దీంతో భారత్‌ అప్రమత్తమయ్యింది.
 భారత్‌ జోడో యాత్ర కారణంగా తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబర్‌ 20వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల యాత్రలో పాల్గొన్న హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ కరోనా బారిన పడినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
 యాత్రలో కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్‌ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలని వారు కోరారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి.. రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు.  తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రం ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబరు 24 ఢిల్లీలోకి ప్రవేశించనుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకూ వారం రోజుల పాటు యాత్రకు విరామం ఇవ్వనున్నారు.