జిఎస్‌టి ఎగవేత నేర విచారణ పరిమితి రూ 2 కోట్లకు పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శనివారం జరిగిన  జిఎస్‌టి   మండలి 48వ సమావేశం  నకిలీ ఇన్వాయిసింగ్‌ మినహా ఇతర పన్ను ఎగవేత కేసుల్లో నేర విచారణ ప్రారంభించేందుకు కనీస పరిమితిని ప్రస్తుతమున్న రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచింది. 

వస్తు సరఫరా లేదా సేవలందించకుండానే నకిలీ ఇన్వాయి్‌సల జారీ ద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడిన సంఘటనల్లో మాత్రం ఎప్పటిలాగే రూ.కోటి దాటిన కేసులపై నేర విచారణ జరగనుంది. ఎవరైనా అధికారిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం, ఉద్దేశపూరితంగా సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించడం, సమాచారం అందించడంలో విఫలమవడాన్ని నేరాల జాబితా నుంచి తొలిగించాలని (డీక్రిమినలైజేషన్‌) మండలి నిర్ణయించింది. 

ఆరు నెలల తర్వాత తొలి సారి జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సమావేశం ఎజెండాలో 15 అంశాలు ఉండగా  కేవలం 8 అంశాలపైనే చర్చించారు. వర్చ్యూవల్‌గా జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏ వస్తువులపై కూడా కొత్తగా పన్నులు వేయలేదు.

 ”పప్పుల పొట్టుపై ఇప్పటి వరకువేస్తును 5 శాతం పన్ను రేటును తగ్గించారు. సమయం చాలకపోవడం వల్ల అప్పలేట్‌ ట్రిబ్యునళ్ల ఏర్పాటును చర్చించలేదు. అదే విధంగా పాన్‌ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతను అడ్డుకొనే యంత్రాంగానికి సంబంధించిన అంశాలు చర్చకు రాలేదు. ఈ సమావేశంలో కొత్త పనుులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.” అని మంత్రి సీతారామన్‌ తెలిపారు. 

ఇక కేంద్రం, రాష్ట్రాలు కలిసి  జిఎస్‌టి   వసూళ్ల పరిధిని మరింత పెంచడంపై దృష్టి సారించనున్నాయని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నెలవారీ జీఎ్‌సటీ స్థూల ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల ఎగువ స్థాయిలో నమోదవుతూ వస్తోంది. 

పెట్రోల్‌లో కలిపేందుకు రిఫైనరీలకు సరఫరా చేసే ఈథైల్‌ ఆల్కహాల్‌పై   జిఎస్‌టి      18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అలాగే, రబ్‌ (ఒకరకమైన బెల్లం)తో పాటు భిన్న ఆకృతుల్లో ఒత్తిన అప్పడాలపై 18 శాతం   జిఎస్‌టి      వర్తిస్తుందని మండలి స్పష్టతనిచ్చింది.

”ఆన్‌లైన్‌ గేమిగ్‌లపై 28 శాతం పనుు వేయాలనే ప్రతిపాదనలపై సమయం లేకపోవడంతో చర్చించలేదు. అదే విధంగా క్యాసినో, రేస్‌ కోర్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి మేఘాలయ సిఎం కన్రాడ్‌ సంగ్మా నేతఅత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సులు ఈ భేటీలో చర్చించలేదు” అని ఆర్ధిక శాఖ  ఉన్నతాధికారులు తెలిపారు.