
ప్రపంచానికి కరోనా వైర్‌సను అందజేసిన డ్రాగన్ దేశం.. పనికిమాలిన వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిందని వియాన్ న్యూస్ ఓ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. సమర్థవంతమైన విదేశీ వ్యాక్సిన్లను నిరాకరిస్తున్న చైనా తమ దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోందంటూ దుయ్యబట్టింది.
ప్రపంచ దేశాల్లో కరోనా తాండవం చేస్తున్న సమయంలో 2020 నవంబరులో చైనా అధినేత షీ జిన్‌పింగ్ తాము వ్యాక్సిన్‌ను కనిపెట్టామని ప్రకటించారు. ఆ వెంటనే వ్యాక్సిన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ దేశాలకు 180 కోట్ల డోసుల మేర వ్యాక్సిన్‌ను అందజేశారు. వాటిల్లో 32.8 కోట్ల డోసులను పేద దేశాలకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఆయా దేశాలు అప్పట్లోనే చైనా వ్యాక్సిన్ ఏమాత్రం పనిచేయదని బాహాటంగానే చెప్పాయి. చైనాకు అత్యంత మిత్ర దేశమైన పాకిస్థాన్ కూడా వ్యాక్సిన్‌ను నమ్ముకుని, ఆ దేశంలో కేసుల సంఖ్య పెరగడానికి కారణమైంది. శ్రీలంక, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండోనేసియా, తుర్కియే.. ఇలా పలుదేశాలు చైనా వ్యాక్సిన్ పనికిరానిదేనని గతంలోనే తేల్చేశాయి.
చైనా ఇటీవలే(బుధవారం) కాంబోడియా దేశానికి 3 లక్షల డోసుల సినోవాక్, పాక్సిలోవిడ్ వ్యాక్సినలను అందజేసింది. ఇప్పుడు కాంబోడియా ఆ వ్యాక్సిన్లను వాడాలా? వద్దా అనే సందిగ్ధంలో ఉందని వియాన్ వెల్లడించింది. అమెరికా నిఘా సంస్థ కూడా చైనా వ్యాక్సిన్లు ఫలితాలను ఇవ్వలేవని ఈ నెల 4న స్పష్టం చేసింది.
చైనా వ్యాక్సిన్ పనిచేయదని స్పష్టం చేసిన వియాన్ న్యూస్ జిన్‌పింగ్ చెప్పినట్లు ఆ దేశ వ్యాక్సిన్ ఉత్తమమైనదే అయితే ఆ దేశంలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అని ప్రశ్నించింది. ప్రజలంతా వ్యాక్సిన్లు తీసుకున్నా లాక్‌డౌన్లు ఎందుకు? ప్రపంచదేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతుంటే.. చైనా ఇంకా తీవ్ర ప్రభావానికి ఎందుకు గురవుతోంది? అంటూ నిలదీసింది.
ఏప్రిల్ నాటికి చైనాలో 10 లక్షల కరోనా మరణాలు!
ఇంతకాలం జీరో కరోనా విధానాన్ని పాటిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేసిన చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించి, లక్షణాలు లేని కరోనా కేసులను వెల్లడించడం ఆపేసింది. డిసెంబర్ 4 నుంచి ఒక్క కరోనా మరణం కూడా లేదని చెప్తున్నది. అయితే, వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
గత వారం రోజుల నుంచి కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని తెలుస్తున్నది. బీజింగ్‌లోని ఓ స్మశానవాటికలో గతంలో రోజుకు సుమారు 12 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగ్గా, ప్రస్తుతం 150 వరకు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే 2023 నాటికి కొవిడ్ మరణాల్లో చైనా కొత్త రికార్డు నెలకొల్పుతుందని అమెరికాకు చెందిన సంస్థ పేర్కొన్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చైనాలో కొవిడ్ మరణాలు ఒక మిలియన్ (10 లక్షలు) దాటవచ్చని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది.
కాగా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి చైనాలో ఇప్పటివరకు 5,235 కరోనా మరణాలు సంభవించినట్టు ఆ దేశం చెప్తున్నది. వాస్తవంగా ఇంతకంటే చాలా ఎక్కువ మంది మరణించారనే వాదనలు ఉన్నాయి. జనవరి 22న చైనాలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. శీతాకాల సెలవులు ప్రారంభం కానున్నాయి. లక్షల మంది స్వంత గ్రామాలకు వెళ్లనున్నారు. దీంతో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు