ఉక్రెయిన్ పై యుద్ధం రష్యా గెలిచిన తర్వాతే యుద్ధం ముగుస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారు అలెగ్జాండర్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టంచేశారు. లేదంటే ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరించారు.
ఈ ప్రకటన రష్యా అధ్యక్షుడి ఆలోచనలకు ప్రతిరూపంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం యుద్ధం బహుళ ధ్రువ ప్రపంచం దిశగా సాగుతోందని డుగిన్ చెప్పారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని చెప్పారు. అయితే, ఈ యుద్ధం పశ్చిమ దేశాలకో, మరే ఇతర దేశాలకో వ్యతిరేకంగా జరుగుతున్నది కానే కాదని స్పష్టంచేశారు.
యుద్ధ ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని విలేఖరులు అడగగా రష్యా గెలిచిన వెంటనే యుద్ధం ఆగిపోతుందని డుగిన్ చెప్పారు. అయితే, అదంత సులువు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచం నాశనమైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతుందని వివరించారు. మేం గెలవడమా.. ప్రపంచ నాశనమా.. రెండింటిలో ఏదో ఒకటి జరగనిదే యుద్ధం ఆగదని డుగిన్ స్పష్టంచేశారు.
“కాబట్టి, యుద్ధం ఏకధ్రువ ప్రపంచ క్రమానికి వ్యతిరేకంగా బహుళ ధ్రువ ప్రపంచ క్రమం. ఇది రష్యా, ఉక్రెయిన్ లేదా యూరప్ గురించి ఏమీ కాదు; ఇది పశ్చిమానికి, మిగిలిన వాటికి వ్యతిరేకంగా కాదు; ఇది ఆధిపత్యానికి వ్యతిరేకంగా మానవత్వం” అంటూ వివరించారు.
ఏదేమైనా, యుద్ధం ముగింపులో విజయం తప్ప మరే ఇతర పరిష్కారాన్ని తాము అంగీకరించమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24న రష్యా తన పొరుగుదేశాన్ని ఆక్రమించినప్పటి నుండి వేలాది మందిని చంపి, లక్షలాది మందిని స్థానభ్రంశం చేసిన సంఘర్షణను ముగించడానికి రష్యా, ఉక్రెయిన్ ప్రస్తుతం చర్చలలో నిమగ్నమై లేవు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో జరుగుతున్న అతిపెద్ద సంఘర్షణకు ముగింపు పలికేందుకు ఈ వారం రష్యా తన దేశం నుండి వైదొలగాలని ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పిలుపిచ్చారు. అయితే, రష్యా సైన్యం ఉపసంహరణ కోసం జెలెన్స్కీ పిలుపుని తిరస్కరించింది. కొత్త ప్రాదేశిక “వాస్తవాలను” అంగీకరించ వలసిందే అని స్పష్టం చేసింది.
More Stories
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ
అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం