బీఎల్‌ సంతోష్‌పై హైకోర్టు స్టే పొడిగింపు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బిజెపి ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ తో పాటు కేరళ వైద్యుడు జగ్గు స్వామికి  హైకోర్టు స్టే పొడిగించింది. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై ఈనెల 13 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. తదుపరి విచారణ ఈనెల 13 వరకు హైకోర్టు వాయిదా వేసింది.
 
 బీఎల్ సంతోష్ కేసులో కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీంతో  వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.  వాస్తవానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు నోటీసులు జారీ చేశారు.
సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి నవంబర్ 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు.
 
అయినా బీఎల్ సంతోష్ హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపైనే హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్‌ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు హైకోర్టు నిర్దేశించింది.