నిరసనలతో తాత్కాలిక లాక్‌డౌన్‌ ఎత్తేసిన చైనా

చైనాలో ‘జీరోకోవిడ్‌’ నినాదంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విస్తృతమైన నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తన కఠిన చర్యలను కొంతమేర సడలించింది. ఈ మేరకు గ్వాంగ్‌జౌ, చాంగ్‌కింగ్‌ లలో కఠినమైన చర్యలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైరుతి నగరమైన చాంగ్‌కింగ్‌ కరోనా ఉన్న వ్యక్తులతో సన్నిహిత పరిచయాలను అనుమతిస్తూ.. కొన్ని షరతులను విధించారు.
 
కరోనా  లక్షణాలు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు రావద్దని,  ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నగర అధికారి ఒకరు తెలిపారు. హాంకాంగ్‌ సమీపంలోని గ్వాంగ్‌జౌ సమీపంలోని ఏడు జిల్లాల్లో విధించిన తాత్కాలిక లాక్‌డౌన్‌లను ఎత్తివేస్తున్నట్లు అధికారులకు ప్రకటించారు. పాఠశాలల్లో వ్యక్తిగత తరగతులను పున:ప్రారంభించేందుకు అనుమతిస్తామని, సినిమాహాళ్లతో సహా రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.
 
దేశంలో కరోనా ప్రతిస్పందనకు బాధ్యత వహిస్తున్న వైస్‌ ప్రీమియర్‌ సన్‌ చున్లాన్‌ అధికారులతో మాట్లాడుతూ, మహమ్మారి నియంత్రణలలో దేశం ”కొత్త దశ, మిషన్‌” ను ఎదుర్కొందని మీడియా జిన్హువా నివేదించింది. వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడేసమయంలో ”మానవ కేంద్రీకృత విధానం” తీసుకోవాలని జిన్హువా పేర్కొన్నారు. 
 
ఈ ప్రభుత్వ సూచనలతో ముఖ్యమైన మార్పును తెస్తుందని పేర్కొన్నారు. దీనివల్లనే ఇప్పటివరకు జీరోకోవిడ్‌ విధానం వ్యాపించకుండా స్థిరంగా ఉందని చెప్పారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్వాంగ్‌జౌలోని హైజుజిల్లాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఆంక్షలు కొంతమేర సడలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
ఇటీవలన చేసిన నిరసనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజలు అడ్డంకులను కూల్చివేస్తున్నట్లు, పూర్తి రక్షణగా ఉంచిన బారీకేడ్‌లను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసు అధికారులపై గాజు సీసాలు విసిరి హింసాత్మకంగా మార్చారు. రక్షణగా పోలీసులు తలలపై కవచాలను పట్టుకున్నట్లు మీడియాలో వచ్చాయి.  నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడం, చేతికి సంకెళ్లతో ప్రజలను తీసుకెళ్లడం వంటి వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి.
 
ఆసియాలో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి 
ప్రపంచ డిమాండ్‌ మందగించడం, చైనా లాక్‌డౌన్‌ ఆంక్షల అనిశ్చితి కారణంగా నవంబర్‌లో ఆసియా అంతటా ఫ్యాక్టరీ ఉత్పత్తి విస్తృతంగా క్షీణించిందని ప్రైవేట్‌ సర్వేలు పేర్కొన్నాయి. లాక్‌డౌన్‌లు అంతర్జాతీయ సరఫరాకు అంతరాయం కలిగించి, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మరింత పతనానికి గురవుతుందనే భయాలను పెంచుతున్నందున, ఫలితాలు 2023 కోసం ఆసియా చీకటి ఆర్థిక దృక్పథాన్ని హైలైట్‌ చేశాయి. 
 
మహమ్మారి నియంత్రణల మధ్య, నవంబర్‌లో చైనా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గిపోయాయని ఒక ప్రైవేట్‌ సర్వే తెలిపింది. ఫలితంగా నాల్గవ త్రైమాసికంలో బలహీనమైన ఉపాధి, ఆర్థిక వృద్ధిని సూచించింది. జపాన్‌, దక్షిణ కొరియాతో సహా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారీ కార్యకలాపాలు తగ్గాయి.
 
”శీతలీకరణ మార్కెట్‌ పరిస్థితులు, స్థిరమైన వ్యయ ఒత్తిళ్లు, బలహీనమైన అంతర్లీన డిమాండ్‌, దేశీయంగా.. అంతర్జాతీయంగా పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతకు ప్రధాన కారణాలుగా నివేదించబడ్డాయి” అని జపాన్‌పై సర్వేను సంకలనం చేసిన ఆర్థికవేత్త లారా డెన్మాన్‌ తెలిపారు. దక్షిణ కొరియా ఫ్యాక్టరీ కార్యకలాపాలు నవంబర్‌లో వరుసగా ఐదవ నెలకు పతనం అయ్యాయి. 
 
ఎగుమతులు రెండున్నరేళ్లలో అత్యధిక వార్షిక తగ్గుదలని చవిచూశాయి. చైనా కష్టాల ప్రభావం ఆసియా అంతటా విస్తృతంగా కనిపించింది. తైవాన్‌ పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో 41.6 వద్ద ఉంది. అక్టోబర్‌లో 41.5 నుండి కొద్దిగా పెరిగింది. వియత్నాం పారిశ్రామి కార్యకలాపాలు అక్టోబర్‌లో 50.6 నుండి నవంబర్‌లో 47.4కి పడిపోయాయి. ఇండోనేషియాలో 51.8 నుండి 50.3కి పడిపోయిందని ప్రైవేట్‌ సర్వేలు చూపించాయి.