మీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది

‘‘గుండెగాం ప్రజల బాధలు వింటే గుండె తరుక్కుపోతోంది. వానొస్తే ఊరంతా మునిగిపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి లేదు. కమీషన్ల కోసం ప్రగతి భవన్, సచివాలయం కట్టుకుంటడు. కాళేశ్వరం కడతడు… కమీషన్లు రావని గుండెగాం ప్రజలను గాలికొదిలేసిండు. అయినా 250 కుటుంబాలను ఆదుకోలేనోడు… తెలంగాణను ఏం కాపాడతాడు?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
 కేసీఆర్ కు పేదలంటే అలుసని, కేసులు పెట్టి బెదిరిస్తూ వేధిస్తూనే ఉంటాడని ధ్వజమెత్తారు. గుండెగాం ప్రజలు బాధపడొద్దని, బీజేపీ పూర్తి అండగా ఉంటూ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే గుండెగాం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు.
 
ప్రజా సంగ్రామ యాత్ర ఇడోవిడత మూడవ రోజు పాదయాత్ర సందర్భంగా గుండెగాం గ్రామస్తులతో  సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి, సీనియర్ నేతలు రామారావుపటేల్, మోహన్ రావు పటేల్ , రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు హాజరయ్యారు. 
 
అంతకుముందు గుండెగాం గ్రామస్తులు బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ ఊరిలోకి స్వాగతం పలికారు. అడుగడుగునా బండి సంజయ్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం రచ్చబండలో గ్రామస్తులతో ముచ్చటిస్తూ వారి బాధలు తెలుసుకున్నారు. 
తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలి. పేదోళ్ల రాజ్యం వస్తేనే, మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.  వర్షం వస్తే ఈ గుండెగాం గ్రామం మునిగిపోతుందని ఇక్కడి తమ్మ”ళ్లు నిన్న నాకు చెప్పినారు. మీ ఊరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటానని నిన్న చెప్పిన. అందుకే ఇప్పుడు మీ ఊరికి వచ్చాను. వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంత నాణ్యతా లోపంతో నిర్మించారో చూశాం. ముట్టుకుంటే పడిపోయే పరిస్థితి ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, ఇండ్లు కట్టిమ్మని మీరు అడుగుతున్నారు… మీ తరుపున ప్రభుత్వం పై పోరాటం చేస్తాం అంటూ భరోసా ఇచ్చారు.
 
ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తూరంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో గుండెగాం గ్రామ మునిగిపోతుందని కనీసం సోయలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. ఇక్కడ 250 కుటుంబాలనే కాపాడలేనోడు… తెలంగాణని ఏం కాపాడుతాడు? అని ప్రశ్నించారు.
 
ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను కూడా కేసీఆర్ దారిమల్లిస్తున్నాడని సంజయ్ విమర్శించారు. దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెడుతున్నాడని ఆరోపిస్తూ తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని స్పష్టం చేశారు. 
 గుండెగాం ప్రజలకు బిజెపి నాయకులు, బిజెపి అండగా ఉంటుందని హామీ ఇస్తూ ఇంకో 6 నెలల తరువాత వచ్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాంగనే గుండెగాంను అద్దంలా మెరిపిస్తాం. అన్ని విధాలా ఆదుకుని అభివ్రుద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.