వార్తల సేకరణలో వేగం కాదు ఖచ్చితత్వం ప్రధానం

‘ఖచ్చితమైన సమాచారం అందించడం మీడియా ప్రధాన బాధ్యత. సమాచారాన్ని ప్రజలకు అందించే ముందు సమాచార ఖచ్చితత్వాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సూచించారు.

ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ 2022 ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొంటూ ‘సమాచార వ్యాప్తి వేగంగా జరగాలి. అయితే, ఇదే సమయంలో సమాచార ఖచ్చితత్వం కూడా అవసరం. ఖచ్చితత్వం అంశానికి మీడియా సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి’ అని చెప్పారు.

పెరిగిన సామాజిక మాధ్యమాల సంఖ్యతో పాటు అవాస్తవ నకిలీ  వార్తల ప్రసారం కూడా పెరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వార్తల బెడద నుంచి  ఆ దిశగా, ఆధారం లేకుండా ప్రచురించిన వార్తలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వాస్తవాన్ని అందించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రభుత్వం   ఫాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.

ప్రజల విశ్వాసాన్ని చూరగొనే అంశానికి మీడియా సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీడియా పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. కరోనా సమయంలో ఇళ్లకు పరిమితం అయిన ప్రజలకు బాహ్య ప్రపంచంతో మీడియా సంబంధాలు కల్పించిందని చెబుతూ ముఖ్యంగా దూరదర్శన్, ఆకాశవాణి అందించిన సేవలను మంత్రి ప్రశంసించారు.

కరోనా సమయంలో విధి నిర్వహణలో దాదాపు 100 మంది ప్రసారభారతి సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి తెలిపారు. అయితే, బాధ్యత మరువకుండా ప్రసారభారతి ప్రజలకు సమాచారం అందించడంలో విజయం సాధించిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో మీడియా భాగస్వామి కావాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా ‘ ప్రజలు ప్రభుత్వం మధ్య మీడియా వారధిగా ఉండాలి. జాతీయ ప్రాంతీయ స్థాయిలో  నిరంతర అభిప్రాయాన్ని అందించాలి” అంటూ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని మంత్రి ప్రస్తావించారు.

సంక్షోభ సమయంలో మీడియా పోషించాల్సిన  పాత్రపై మీడియా ప్రతినిధులకు అత్యుత్తమ వృత్తిపరమైన నైపుణ్యాలతో ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్  శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. 

సమాచార రంగానికి చెందిన అంశాలపై ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ తో కలిసి భారతదేశం పనిచేస్తోందని  అనురాగ్ సింగ్ తెలిపారు. ఈ విషంయంలో ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్  మీడియా అకాడమీతో కలిసి ప్రసారభారతి అనుబంధ శిక్షణా సంస్థ కార్యక్రమాలు అమలు చేస్తున్నాదని మంత్రి వివరించారు.

ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, ఫిజీ, మాల్దీవులు, నేపాల్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలతో సహా 40 దేశాలతో కంటెంట్ మార్పిడి, సహ-ఉత్పత్తి, సామర్థ్యం పెంపుదల మొదలైన రంగాలలో భారతదేశం  ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి తేలిపోయారు.

“కార్యక్రమాల మార్పిడి  కోసం మార్చి 2022 లో ప్రసార రంగంలో ఆస్ట్రేలియాతో భారతదేశం కలిసి పనిచేసింది.   రెండు దేశాల ప్రసారకర్తలు వివిధ రంగాలలో కలిసి కార్యక్రమాలు రూపొందించడం, కలిసి కార్యక్రమాలను ప్రసారం చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు.” అని మంత్రి వివరించారు.